వికారాబాద్లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మెథడిస్ట్ ఆస్పత్రిని వైద్యాధికారులు సీజ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రిని నడిపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలోనే నోటీసులు జారీ చేయగా.. రంగారెడ్డి జిల్లా నుంచి అనుమతులు ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. కానీ.. ఆ ఆస్పత్రికి ఎక్కడా అనుమతులు లేవని నిర్ధారించుకున్న అధికారులు ఎపిడమిక్ యాక్టు 1897, 2005తో పాటు క్లినికల్ ఎక్లాబ్సిమెంట్ 2010 కింద కేసు నమోదు చేసి దవాఖానాను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ దశరథ్ తెలిపారు.
ఇవీ చూడండి: సాదాసీదాగా తెజస వార్షికోత్సవం