పల్లె నిద్రలో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి... తన నియోజకవర్గంలోని ప్రేమ్‌నగర్ కాలనీలో నిద్ర చేశారు. కాలనీవాసుల సమస్యలను తెలుసుకొని... నేనున్నాననే భరోసా కల్పించేందుకే నిద్ర చేసినట్లు ఆయన తెలిపారు.
నూతనంగా ఏర్పడిన పరిగి మున్సిపాలిటీని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు. ప్రేమ్‌నగర్‌లోని ప్రతి ఇంటికి తిరిగి... వారి సమస్యలు తెలుసుకొని... వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీనిచ్చారు.
ఇదీ చూడండి : 'పల్లె ప్రగతి స్ఫూర్తితోనే పట్టణాల రూపురేఖలు మారుస్తాం'