ETV Bharat / sports

అఫ్గాన్ ఓపెనర్ రేర్ ఫీట్ - ఆ సెంచరీతో సచిన్‌, కోహ్లీ రికార్డులు బ్రేక్!

బంగ్లాతో మ్యాచ్​లో సూపర్ సెంచరీ - రేర్ రికార్డ్​ అందుకున్న అఫ్గాన్ ఓపెనర్

Rahmanullah Gurbaz
Rahmanullah Gurbaz (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 12, 2024, 10:27 AM IST

Rahmanullah Gurbaz Elite Record : దుబాయ్​లోని షార్జా వేదిక‌గా తాజాగా జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డే పోరులో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది అఫ్గానిస్థాన్‌ జట్టు. అలా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్​లో స్టార్ ఓపెన‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన ఇన్నింగ్స్​తో అఫ్గాన్ జట్టు గెలుపులో కీల‌క పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ విజయంతో గుర్భాజ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

సచిన్, కోహ్లీ రికార్డులు బ్రేక్!
ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా ఓ అద్బుత‌మైన సెంచ‌రీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఈ గేమ్​లో 120 బంతులు ఆడి అందులో 5 ఫోర్లు, 7 సిక్స్‌ల‌ సాయంతో ఏకంగా 101 ప‌రుగులు స్కోర్ చేశాడు. అలా 245 ప‌రుగుల ల‌క్ష్య చేధ‌న‌ను అఫ్గాన్ జట్టుకు ఈజీగా చేసి ఆ టీమ్ గెలుపులో ఓ కీలక భాగమయ్యాడు. అయితే గుర్బాజ్ ఈ సెంచరీతో ఓ రేర్​ రికార్డును సొంతం చేసుకున్నాడు.

అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో అతి పిన్న వ‌య‌స్సులోనే ఎనిమిది సెంచరీలు నమోదు చేసిన రెండో క్రికెటర్​గా రికార్డుకెక్కాడు. కేవ‌లం 22 సంవత్సరాల, 349 రోజుల వ‌య‌స్సులో గుర్భాజ్ ఈ ఫీట్‌ను అందుకుని సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీల రికార్డులను బ్రేక్ చేశాడు.

గుర్భాజ్ కేవ‌లం 22 సంవత్సరాల, 349 రోజుల వ‌య‌స్సులోనే ఈ రికార్డును అందుకోగా, సచిన్ 22 ఏళ్ల 357 రోజుల వ‌య‌స్సులో, అలాగే కోహ్లి 23 ఏళ్ల 27 రోజుల వ‌య‌స్సులో ఈ ఘనత సాధించారు. అయితే ఈ లిస్ట్​లో వీరితో పాటు సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ క్వింట‌న్ డికాక్ కూడా స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. డికాక్ 22 ఏళ్ల 312 రోజుల్లో ఈ రికార్డును తన ఖాతలో వేసుకున్నాడు.

ఇదిలా ఉండగా, రహ్మానుల్లాకు ఇది ఎనిమిదో వ‌న్డే అంత‌ర్జాతీయ సెంచ‌రీ కావ‌డం విశేషం. అంతేకాకుండా కాగా అఫ్గాన్ జ‌ట్టు వ‌న్డేల్లో సాధించిన మొత్తం సెంచరీల(30)లో గుర్భాజ్ సాధించినివే 25 శాతం ఉండటం గ‌మనార్హం.

Rahmanullah Gurbaz World Cup : ఆగ్రహంతో ఊగిపోయిన అఫ్గాన్‌ ప్లేయర్‌.. మందలించిన ఐసీసీ

చరిత్ర సృష్టించిన గుర్బాజ్ - తొలి అఫ్గాన్ ప్లేయర్​గా రికార్డ్! - Rahmanullah Gurbaz Record

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.