ETV Bharat / state

Shirisha murder case update : శిరీష హత్య కేసులో వీడని సందిగ్దత.. తండ్రిపై గ్రామస్థుల దాడి - telangana crime news

Paramedical student Shirisha murder case update : పారామెడికల్‌ విద్యార్థిని శిరీష హత్యకేసులో మిస్టరీ వీడలేదు. ఇప్పటివరకు హత్యగా అనుమానించిన పోలీసులు తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. మరోవైపు శిరీషది ముమ్మాటికీ హత్యేనని.. మృతురాలి కుటుంబీకులు వాస్తవాలు దాచిపెడుతున్నారని గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఒకనొక సమయంలో శిరీష తండ్రి జంగయ్యపై మూకుమ్మడిగా దాడి చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.

sirisha
sirisha
author img

By

Published : Jun 12, 2023, 5:21 PM IST

Updated : Jun 12, 2023, 7:16 PM IST

శిరీష హత్య కేసులో వీడని సందిగ్దత.. తండ్రిపై గ్రామస్థుల దాడి

Nursing student Shirisha murder case updated : తీవ్ర కలకలం రేపిన పారామెడికల్‌ విద్యార్ధిని శిరీష హత్య కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష శనివారం రాత్రి 10గంటల సమయంలో బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం ఉదయం తీవ్ర గాయాలతో ఉన్న మృతదేహం ఇంటికి సమీపంలో ఉన్న నీటి కుంటలో కనిపించింది. ఈ కేసులో బావ అనిల్‌పై అనుమానం రావడంతో పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

ఇప్పటివరకు హత్యా కేసు నమోదుచేసిన పోలీసులు శిరీష కుటుంబీకులు చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యా కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో అన్నం వండే విషయంలో తన కుమార్తెను బావ కొట్టినట్లు అదే సమయంలో తాను కూడా చేయిచేసుకున్నట్లు శిరీష తండ్రి తెలిపాడు. ఆ తర్వాత రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగిరాలేదని తెలిపాడు. కుటుంబసభ్యుల వాంగ్మూలంపై కాడ్లాపూర్‌ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా యువతిని ఆమె బావే హత్యచేసినట్లు ఆందోళన చేపట్టారు.

Shirisha murder case investigation : కుటుంబీకులు వాస్తవాలు దాచిపెడుతున్నారని మండిపడ్డారు. అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రామస్థులకు సర్దిచెప్పి పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నామని దోషులు ఎవరైనా వదిలిపెట్టబోమని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల చెప్పిన వివరాల మేరకు ఆత్మహత్యా కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహంపై మరణించేంత గాయాలు లేవని.. వాస్తవాలు తెలుసుకునేందుకే మరోసారి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. ఎఫ్​ఎస్​ఎల్​ నివేదిక వచ్చిన తర్వాత నిజానిజాలు బయటకువస్తాయని వైద్యులు తెలిపారు. గ్రామస్థుల ఆందోళనలు, అనుమానాల నడుమే శిరీష మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు.

శిరీష తండ్రిపై గ్రామస్థుల దాడి: శిరీషది ఆత్మహత్యగా చూపే ప్రయత్నం జరుగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. శిరీష తండ్రి జంగయ్యకు అన్ని తెలుసునని అంటున్నారు. ఈ మేరకు ఆయన్ను కాడ్లాపూర్‌ గ్రామస్థులు నిలదీశారు. ఒకనొక సమయంలో జంగయ్యపై దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మరోవైపు యువతి కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే శిరీష బావ అనిల్​ను విచారిస్తున్న పోలీసులు శనివారం రాత్రి గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్ లాగేసుకున్నట్లు తేలింది. మరుసటి రోజు యువతి ఫోన్ నుంచి ఓ వ్యక్తికి కాల్ వెళ్లినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాడ్లపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంత్యక్రియల అనంతరం శిరీష తండ్రి జంగయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.

"కుటుంబ సభ్యుల స్టేట్​మెంట్​ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. ఆమె కళ్లకు, శరీరంపై అక్కడక్కడ గాయాలు ఉన్నాయి. కానీ ఆ గాయాలతో ఆమె మరణించే అవకాశం లేదు. ఎఫ్​ఎస్​ఎల్​ నివేదిక వచ్చిన తరువాత నిజనిజాలు బయటకు వస్తాయి."- విఠల్‌రెడ్డి, పరిగి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఇవీ చదవండి:

Hyderabad Apsara Marriage Photos Viral : 'అప్సరకు పెళ్లయిందా.. లేదా.. అనేది అనవసరం'

Apsara Case Remand Report : "How to Kill human being" అని గూగుల్​లో సెర్చ్ చేసిన సాయికృష్ణ

Last Updated : Jun 12, 2023, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.