ఖమ్మం జిల్లా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య సంఘటనపై తాండూర్‌లో కార్మికులు కొవ్వత్తూలు వెలిగించి సంతాపం తెలిపారు. అతని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అక్కడి నుంచి అంబేద్కర్ కూడలి, ఆచార్య జయశంకర్ కూడలి మీదుగా కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలు రాజకీయ పార్టీల నాయకులు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : శ్రీనివాసరెడ్డి మృతికి కేసీఆర్‌దే బాధ్యత: అశ్వత్థామరెడ్డి