వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్మికుల దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికులకు స్వయంగా తనే భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
కార్మికులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. కరోనా వైరస్ కట్టడిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు పోషించిన పాత్ర గొప్పదని అన్నారు. ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరిస్తూ... కరోనా వైరస్ కట్టడిలో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం