ETV Bharat / state

కిడ్నాప్ కాదది... ప్రేమ.. డీఎస్పీ ఆఫీస్​లో మణిదీపిక - vikarabad kidnap case latest news

సంచలనం సృష్టించిన వికారాబాద్​ కిడ్నాప్​ కేసులో చిక్కుముడి వీడింది. వికారాబాద్​ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని మణిదీపిక, అఖిల్​లు తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

manideepika-reaches-vikarabad-dsp-office
కిడ్నాప్ కాదది... ప్రేమ.. డీఎస్పీ ఆఫీస్​లో మణిదీపిక
author img

By

Published : Sep 29, 2020, 7:11 PM IST

Updated : Sep 29, 2020, 8:41 PM IST

వికారాబాద్ జిల్లాకు చెందిన మణిదీపిక అపహరణ కేసులో చిక్కుముడి వీడింది. వికారాబాద్​ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని అఖిల్​, మణిదీపికలు తమ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అఖిల్‌ తనను కిడ్నాప్‌ చేయలేదని మణిదీపిక పోలీసులకు చెప్పింది. ఇష్టపూర్వకంగానే అఖిల్‌తో వెళ్లినట్లు.. గతంలోనే ఇద్దరూ ప్రేమవివాహం చేసుకున్నట్లు తెలిపింది. ఇకపై అఖిల్‌తోనే కలిసి ఉంటానని తేల్చిచెప్పింది.

రెండ్రోజుల క్రితం మణిదీపికను అఖిల్​ కారులో తీసుకెళ్లారు. తమ కూతురిని అపహరించారని మణిదీపిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా... వారు దర్యాప్తు ముమ్మరం చేశారు. 2016లోనే అఖిల్ , దీపికకు వివాహమైందని పోలీసులు నిర్దారించుకున్నారు. వివాహం అనంతరం మణిదీపికను తల్లిదండ్రులు అఖిల్​కు దూరం చేశారని తెలిపారు.

వికారాబాద్​ కిడ్నాప్​ కేసు.. డీఎస్పీ ఆఫీస్​లో మణిదీపిక ప్రత్యక్షం

ఇదీ చూడండి: వికారాబాద్​లో పంతొమ్మిదేళ్ల యువతి అపహరణ

Last Updated : Sep 29, 2020, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.