ఇంటర్ పేపర్ మూల్యాంకనం కోసం గత వారం రోజులుగా వారికి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం బస్సులు ప్రారంభం కావడం వల్ల వాటిలోని వెళ్లాలని సూచించారు. దాంతో సుమారు 100 మంది లెక్చరర్లు సమయానికి చేరుకోలేకపోతున్నామని వికారాబాద్ జిల్లా పరిగి బస్‌డిపో వద్ద ఆందోళన చేశారు.
తమకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మూల్యంకనానికి వెళ్లబోమని నిరసన చేపట్టారు. మూల్యాంకనం చేసే సరికి సాయంత్రం 6 నుంచి 7 అవుతుంది. ఆ సమయంలో మాములు బస్సులు అందుబాటులో ఉండవని వారు చెబుతున్నారు. మేము అనేక ఇబ్బందులు పడాల్సివస్తుందని అంటున్నారు. అధికారులు స్పందించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేటు వాహనాల్లో వెళితే రూ. 60 వరకు ఖర్చవుతుందని అన్నారు. ఇక మాకు మిగిలేందటని వాపోతున్నారు.
ఇదీ చూడండి : 27 రకాల పురుగుమందులపై వేటు