ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించిన న్యాయమూర్తి వికారాబాద్ జిల్లా తాండూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినజిల్లా మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి స్వప్న అక్కడి పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశుభ్రత సరిగా లేదని సిబ్బందిపై మండిపడ్డారు.సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు సమయానికి వస్తున్నారా లేరా అనే అంశంపై ఆరా తీశారు.
ఆసుపత్రే అపరిశుభ్రంగా ఉంటే రోగాలు ఎలా నయమవుతాయని వైద్యులను స్వప్న ప్రశ్నించారు. ఆసుపత్రి మొత్తం దుర్వాసన వస్తోందని వెంటనే మెరుగుపరచాలని ఆదేశించారు. లేకుంటే ఆయా విభాగాలకు తాఖీదులు జారీ చేస్తానని హెచ్చరించారు.
ఇవీ చూడండి:తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ తనిఖీలు