ETV Bharat / state

ఆధునిక జీవన శైలితో శరీరంలోకి భారలోహాలు - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

సహజసిద్ధ ఆహార పదార్థాలు కరవైన వేళ వింత రోగాలు వెంటాడుతుంటాయని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆధునిక జీవన శైలిలో భారలోహాలు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దుస్థితే ఏలూరు ఘటనకు కారణమంటున్నారు.

Heavy metals are entering our body in modern lifestyle Scientists are concerned due to eluru incident
ఆధునిక జీవన శైలి: మానవ శరీరంలోకి ప్రవేశిస్తున్న భారలోహాలు
author img

By

Published : Dec 13, 2020, 3:48 PM IST

సీసం(లెడ్‌), కాడ్మియం, పాదరసం వంటి భారలోహాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్తలు తెలిపారు. ఏలూరులో వింత రోగానికి లెడ్‌, నికెల్‌ ప్రభావంతో పాటు.. బ్యాక్టీరియా, రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉందని ప్రాథమికంగా తేలిందన్నారు. ఈ నేపథ్యంలో భారలోహాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ టాక్సికాలజీ రీసెర్చ్‌ సెంటర్‌ విభాగాధిపతి డా.బి.దినేశ్‌కుమార్‌ వివరించారు.

మెదడుపై ప్రభావం..

ఏ రంగు తయారవ్వాలన్నా సీసం తప్పనిసరి ఉండాల్సిందే. ఆడుకునే బొమ్మలో బ్యాటరీలలో సీసం, కాడ్మియం ఉంటుంది. కొంతమంది పిల్లలు బ్యాటరీలను మింగేస్తుంటారు. 14 ఏళ్లలోపు పిల్లల్లో ఇది మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో 100 మిల్లీలీటర్ల రక్తంలో 10 మైక్రోగ్రాములు, పెద్దల్లో 20 మైక్రోగ్రాముల కంటే సీసం పరిమితి ఎక్కువైతే సమస్యలు వస్తాయి. రక్తంలో సీసం కలిస్తే పిల్లల్లో తెలివితేటలు పెరగవు. రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గుతుంది. నరాల బలహీనత వస్తుంది. కండరాలపై ప్రభావం చూపుతుంది. న్యూరో సమస్యలు తలెత్తుతాయి. 5 శాతం కిడ్నీ వ్యాధులకు కారణమవుతాయి. మూర్ఛ, వికారం, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కిడ్నీలూ దెబ్బతింటాయి.

సీసం, నికెల్‌, కాడ్మియం, పాదరసం వంటి భారలోహాలు అజాగ్రత్త, నిర్వహణ లోపం వల్ల ప్రాణాలకే ముప్పుగా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా సీసం ఎక్కువ ప్రభావం చూపుతోంది. బ్యాటరీలు, ఇన్‌వర్టర్లు రూపంలో లెడ్‌ అందరి ఇళ్లలో ఉంటోంది. ఆటోమొబైల్‌, ముద్రణాలయాలు, స్క్రీన్‌ ప్రింటింగ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగులపై లెడ్‌ ప్రభావం ఎక్కువ. అలంకరణ రంగుల్లో సీసం అధికం. బ్యాటరీల వ్యర్థాలను పడేయడం వల్ల అవి భూమిలో కలిసి నీటిలో కరిగి.. క్రమంగా ఆహార పదార్థాల్లోకి చేరుతున్నాయి. - డా.దినేశ్‌.

ఇవీ చూడండి: ఇక్కడ టీ తాగితే కప్ తినాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.