Vikarabad forest land grabbed: వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు అనుకొని ఉన్న హరివిల్లు రిసార్ట్స్‌లో ఫారెస్ట్‌కు సంబంధించి రెండు ఎకరాలు భూమి ఆక్రమణకు గురైనట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆక్రమణకు సంబంధించి హరివిల్లు రిసార్ట్స్ యజమాని గంగాధర్ రావుకు ఫారెస్ట్ సిబ్బంది నోటీసు ఇవ్వడానికి వెళ్లగా.. వారితో దురుసుగా ప్రవర్తించారని ఎఫ్ఆర్ఓ అరుణ తెలిపారు. అదీకాకుండా నోటీసులను సైతం సిబ్బంది ముఖంపై విసిరి కొట్టారని ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు.
అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన గంగాధర్ రావుపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే హరివిల్లు రిసార్ట్స్ యజమానిని అనేక సార్లు హెచ్చరించామని, వాటిని పట్టించుకోకుండా అలాగే రిసార్ట్స్‌ను కొనసాగిస్తున్నారని తెలిపారు. అక్రమించడమే కాకుండా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంపై చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతగిరి అటవీ సమీపంలో ఉన్న హరివిల్లు రిసార్ట్స్ రెండు ఎకరాల భూమి కబ్జా గురైనట్టు మా దృష్టికి వచ్చిందని జిల్లా ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఫారెస్ట్ సిబ్బంది సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం వచ్చిందని, ఫారెస్ట్ చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. మహిళా అధికారి అని చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేసిన అతనిని చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు.
ఇవీ చదవండి: