ETV Bharat / state

'ఇసుక అక్రమ రవాణా... ఆధారాలు ఉన్నా చర్యలేవి?'

author img

By

Published : Feb 27, 2021, 7:54 PM IST

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గంగ్వార్ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

gangwar-village-people-protest-at-tehsildar-office-for-sand-mafia-in-vikarabad-district
'ఇసుక అక్రమ రవాణా... ఆధారాలు ఉన్నా చర్యలేవి?'

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం గంగ్వార్ గ్రామస్థులు డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులే ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలు చెప్పినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని రెవెన్యూ అధికారులను నిలదీశారు. బషీరాబాద్​లోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

కూలీల సాయంతో అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తే కూలీలకు ఉపాధితో పాటు అభివృద్ధి పనులు జరగడానికి అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఇది కాకుండా రాజకీయ పలుకుబడితో ఇసుక తరలిస్తున్నారని... అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: వైద్యం వికటించి వ్యక్తి మృతి... ఆస్పత్రి ఎదుట ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.