వాట్సాప్ ఓ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. స్నేహితులను (friends help) ఏకం చేసి.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆ కుటుంబానికి భరోసానిచ్చింది.
ఇదీ జరిగింది..
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన మైపాల్ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. భార్య గర్భవతి. ఒక కుమార్తె ఉంది. సంతోషంగా సాగిపోతున్న వారి కుటుంబంలో.. రోడ్డు ప్రమాదం దీనస్థితికి తీసుకువచ్చింది.
రోడ్డున పడేసిన ప్రమాదం
గర్భవతి అయిన తన భార్యతో పాటు కుమార్తెతో కలిసి హైదరాబాద్ నుంచి తన మిత్రుడి కారులో తన స్వగ్రామానికి బయలుదేరాడు. సంతోషంగా బయలుదేరారు. కానీ మార్గమధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దామరగిద్ద వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని... మహిపాల్ ప్రయాణిస్తున్న కారుపైకి దూసుకొచ్చాయి. ఈ ఘటనలో మహిపాల్ కాలు విరిగిపోయింది. గర్భవతిగా ఉన్న అతని భార్య భుజం ఎముక విరిగింది. అంతే కాకుండా గర్భస్రావం కూడా జరిగింది. కుమార్తె స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ క్రమంలో వీరిద్దరి చికిత్స నిమిత్తం దాదాపు ఏడు లక్షల రూపాయల వరకు ఖర్చు అయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడటం వల్ల బెడ్ రెస్టుకు అంకితం అయ్యాడు మహిపాల్. కుటుంబం గడవడం కష్టతరమైంది.
ఆసరాగా నిలిచిన వాట్సాప్గ్రూప్
ఆ కుటుంబ దీనస్థితిని చూసి స్నేహితులు చలించిపోయారు. ఏదైనా సహాయం చేయాలి అని అంతా అనుకున్నారు. అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఓ స్నేహితుడు తమ గ్రామ వాట్సాప్ గ్రూపులో మహిపాల్ పరిస్థితిపై ఓ పోస్ట్ పెట్టాడు. స్పందించిన అతని మిత్రులు, గ్రామ యువకులు డబ్బులు జమ చేశారు. మహిపాల్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా మహిపాల్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. దీనిపై గ్రామస్థులు వారిని మెచ్చుకుంటున్నారు.
ఇవీ చూడండి: