ETV Bharat / state

Farmers: కేంద్రాల్లో పేరుకున్న నిల్వలు.. తూకాలకు నిరీక్షణ? - తెలంగాణ వార్తలు

పంట దెబ్బతింటే అప్పుల తిప్పలు.. కాలం కలిసొచ్చి దిగుబడులు బాగా వస్తే అమ్ముకోవడానికి అవస్థలు. మరోవైపు అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతోందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో లక్ష మెట్రిక్‌ టన్నుల వడ్లు కేంద్రాలకు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేసినా, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయలేదు. ప్రస్తుతం కేంద్రాల్లో ధాన్యం సంచులు పేరుకుపోయి రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు దాపరించాయి. మిల్లర్ల సామర్థ్యానికి మించి నిల్వలు ఉండటంతో, రంగారెడ్డి, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

farmers, grain purchases
ధాన్యం కొనుగోళ్లు, రైతుల ఆందోళన
author img

By

Published : May 28, 2021, 1:47 PM IST

వికారాబాద్‌ జిల్లాలో రబీ సీజన్‌లో 70 వేల ఎకరాల్లో వరి పండించారు. లక్ష మెట్రిక్‌ టన్నుల దిగుబడులు వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం జిల్లా పౌరసరఫరాల శాఖ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి మిల్లర్లకు ధాన్యం తరలించడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌ల ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో 77 కొనుగోలు కేంద్రాలు ఉండగా సోమవారం వరకు 3,347 మంది రైతుల నుంచి 1,56,401 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సకాలంలో లారీలు రాకపోవటంతో తూకం చేసిన ధాన్యం 64,685 క్వింటాళ్ల నిలువలు కేంద్రాల్లోనే ఉండిపోయింది. మిగతా సంస్థల ఆధ్వర్యంలోనూ కొనుగోళ్లు జరగుతున్నాయి.

మూడు మిల్లులే ఆధారం

జిల్లాలో మూడు మిల్లులే ఆధారం. వాటి సామర్థ్యం 30 వేల మెట్రిక్‌ టన్నులు. వాటిల్లో గతేడాది ఖరీఫ్‌కు సంబంధించిన ధాన్యం నిల్వలు ఉండటం, మళ్లీ ఇపుడు రావడంతో రెండింతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మిన్నకున్న అధికారులు కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లోని కొనుగోలు కేంద్రాల నుంచి రంగారెడ్డికి ఆరు వేల మెట్రిక్‌ టన్నులు, కరీంనగర్‌కు మరో 20 మెట్రిక్‌ టన్నులు తరలించాలని నిర్ణయించారు. కేంద్రాల్లో నిల్వ చేసేందుకు స్థలం లేక దౌల్తాబాద్‌ మండలంలోని ఓ పత్తి మిల్లులో నిల్వ చేయాలని నిర్ణయించారు. అక్కడికి భారీ ఎత్తున ట్రాక్టర్లలో బస్తాలను తరలిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై మూడు కిలోమీటర్ల పొడవునా ట్రాక్టర్లు బారులు తీరి ఉన్నాయి. వీటిని ఖాళీ చేయించేందుకు రెండు రోజులు పడుతోందని వాపోతున్నారు. ట్రాక్టర్‌ అద్దె, బస్తాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, హమాలీల చెల్లింపులు రెండు సార్లు ఇవ్వాల్సి వస్తోందని, ఫలితంగా అదనపు భారం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పేరుకుపోయిన ధాన్యం

స్థలం లేక

కొడంగల్‌ నియోజకవర్గంలో చెరువులు, బోరుబావుల కింద యాసంగిలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకరావటంతో నిల్వకు స్థలం లేదని రైతులు వాపోతున్నారు. లారీలు రాకపోవటం, మిల్లుల సేకరణ లక్ష్యం పూర్తికావటంతో నిల్వలు పెరుగుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా బొంరాస్‌పేట మండలంలోనే 18,221 క్వింటాళ్లు, దౌల్తాబాద్‌లో 12,870, దోమ, కుల్కచర్ల ఒక్కో మండలంలో 80 వేల క్వింటాళ్ల చొప్పున నిల్వలున్నాయి. ధాన్యం తీసుకరావద్దని కోరుతున్నా వస్తున్నారని నాగిరెడ్డిపల్లి కొనుగోలు కేంద్రం నిర్వాహకురాలు సత్యమ్మ చెప్పారు.

ఎదురు చూపులు

ఎదురు చూపులు

తాండూరు మండలవ్యాప్తంగా కేంద్రాల్లో రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. పదిహేను గ్రామాల్లో సహకార సంఘం, డీసీఎమ్మెస్‌, ఐకేపీ ఆధ్వర్యంలో కేంద్రాలు కొనసాగుతున్నాయి. బెల్కటూరుకు సంబంధించి మారుతి పాఠశాలలో ఏర్పాటుచేశారు. వచ్చిన ధాన్యాన్ని రోజుకు ఒకటిరెండు లారీల్లో తరలించాల్సి ఉండగా పదిహేను రోజులుగా రెండు లారీలు మాత్రమే తరలించారు. మిగిలినది పాఠశాల మైదానంలో ఉంచారు. చెంగోల్‌లో రెండు వారాలుగా తూకాలు వేయకపోవడంతో నిరీక్షిస్తున్నారు. ఖాళీ ప్రదేశంలో నిల్వ ఉంచి కాపలా ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొందరు పొలాల్లోనే ఉంచారు. అంతారం కేంద్రాల్లో పదకొండు రోజులుగా ఒక్క లారీ మాత్రమే తరలించారు. మిగిలిన బస్తాలు పేరుకుపోయి కొనుగోలు చేయడంలేదు. మిగిలిన గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది.

పత్తి మిల్లుకు వచ్చి నిరీక్షిస్తున్నా

దౌల్తాబాద్‌ కొనుగోలు కేంద్రానికి 130 బస్తాల ధాన్యం తెచ్చి తూకం వేయించా. ప్రస్తుతం నిర్వాహకులు నీటూరు పత్తి మిల్లుకు తరలించాలని చెప్పడంతో, ట్రాక్టర్‌లో బుధవారం మధ్యాహ్నం వచ్చా. ఇప్పటి వరకూ తూకం వేయలేదు.

- మల్కప్ప, దౌల్తాబాద్‌

తిప్పలు తప్పడం లేదు

పంట పండించడం ఒక ఎత్తైతే విక్రయించడం ఇంకా గగనంగా మారుతోంది. మూడున్నర ఎకరాల్లో వరి పండించగా 90 బస్తాల దిగుబడి చేతికొచ్చింది. కోతలు పూర్తై పదిరోజులు దాటింది. కేంద్రానికి తరలిద్దామంటే తూకాలు వేయడం లేదు. రోజుల తరబడి పొలంలో ఉంచి ఎదురు చూడాల్సి వస్తోంది.

-నాగిరెడ్డి చెంగోల్‌

బాధ్యత కేంద్రాల నిర్వాహకులదే
కేంద్రాలకు తెచ్చిన ధాన్యం తూకం చేశాక రైతు పని పూర్తయినట్లే. అక్కడి నుంచి బస్తాలను స్టాక్‌ పాయింట్లకు తరలించే బాధ్యత కేంద్రాల సిబ్బందిదే. హమాలీ, రవాణా, ఇతర అన్ని రకాల ఖర్చులు నిర్వాహకులే భరించాల్సి ఉంటుంది. ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఫిర్యాదు చేయండి. వెంటనే చర్యలు తీసుకుంటాం.

-మోతీలాల్‌, అదనపు కలెక్టర్‌

ఇదీ చదవండి: Birth Anniversary: మూగపడిన తెలంగాణ మూల్గిన తొలినాటి ధ్వనే.. సురవరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.