ETV Bharat / state

కొడంగల్‌లో కంది రైతుల ఆందోళన

author img

By

Published : Jan 30, 2020, 7:52 PM IST

కొడంగల్‌ కంది రైతులు రోడెక్కారు. వ్యవసాయ అధికారులు ఒక్కో రైతు నుంచి కేవలం రెండున్నర క్వింటాళ్ల కందులనే కొనుగోలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడంగల్‌లో కంది రైతుల ఆందోళన
కొడంగల్‌లో కంది రైతుల ఆందోళన

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో కంది రైతులు ధర్నా చేపట్టారు. అధికారులు పెట్టిన నిబంధనలతో తమకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కూడలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

అధికారులు ఒక్కో రైతు నుంచి రెండున్నర క్వింటాళ్ల కందులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల కందులు దిగుమతి వచ్చాయని... అధికారులు కేవలం రెండున్నర క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడంతో.. మిగితా కందులను ఎక్కడ అమ్ముకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్సై ప్రభాకర్ రెడ్డి సీఐ నాగేశ్వర రావు రైతులకు శాంతింపజేసి ధర్నా విరమింప చేశారు.

కొడంగల్‌లో కంది రైతుల ఆందోళన

ఇదీ చూడండి: దిల్లీ దంగల్​: 'ఆమ్ ​ఆద్మీ'కి బంగాల్​ దీదీ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.