ETV Bharat / state

రేకుల ఇల్లు.. రూ.19.50 లక్షల కరెంటు బిల్లు - high current bill in telangana

రేకుల ఇళ్లు. ఒక బుగ్గ. ఉండేది ఇద్దరు. ఎప్పుడూ నెలకు రూ.50 బిల్లు వచ్చేది. ఇప్పుడు ఏకంగా రూ.19.50 లక్షల బిల్లు వచ్చింది. ఆ బిల్లు చూసి ఆ వృద్ధ దంపతులకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది.

current bill
current bill
author img

By

Published : Jun 12, 2020, 12:22 PM IST

తిందామంటే తిండికి గతి లేదు. పని చేసుకుందామంటే వయసు మీరింది. ఉన్న రేకుల ఇంట్లో ఒక్క బుగ్గ వేసుకుంటాం. మొన్నటివరకు నెలకు రూ.50 కరెంటు బిల్లు వచ్చేది. మధ్యలో ఒక నెల కట్టలేదు. ఇప్పుడు ఏకంగా రూ.19,58,194 బిల్లు వచ్చిందని రసీదు ఇచ్చివెళ్లారు. ఎక్కడి నుంచి కడతాం. ఇదీ.. వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం మేకవనంపల్లికి చెందిన కె.మల్లమ్మ ఆవేదన.

భార్యభర్తలిద్దరూ రేకుల ఇంట్లో నివసిస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా డబ్బులు లేక గత నెల బిల్లు చెల్లించలేదు. ప్రస్తుతం విద్యుత్తు సిబ్బంది రీడింగ్‌ తీయగా 5,33,946 యూనిట్లు వినియోగించినట్లు.. రూ.19.58 లక్షల బిల్లు వచ్చింది. ఈ విషయమై విద్యుత్తుశాఖ జిల్లా పర్యవేక్షక ఇంజినీరు జానకీరాంను వివరణ కోరగా.. పొరపాటున అలా వచ్చి ఉంటుందని, సరి చేస్తామన్నారు.

ఇదీ చదవండి: ఆంధ్ర ప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.