DK Shivakumar Speech in Congress Bus Yatra Vikarabad : రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కోరారు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే.. తప్పక నెర వేరుస్తుందని చెప్పారు. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నుంచి రెండో విడత కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర(Congress Bus Yatra)ను హస్తం పార్టీ ప్రారంభించింది. ఈ విజయభేరి యాత్రలో ముఖ్య అతిథిగా డీకే శివకుమార్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు.
కర్ణాటకలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఐదు గ్యారెంటీ(Congress Guarantees)లను కాంగ్రెస్ అమలు చేస్తోందని డీకే శివకుమార్ అన్నారు. కేసీఆర్ ఈ పదేళ్లలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నేరవేరిందా అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో ఆ హామీలను కాంగ్రెస్ అప్పుడే అమలు చేసిందని.. అనుమానం ఉంటే కేసీఆర్ అక్కడకు వచ్చి చూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందని తెలిపారు. డిసెంబరు 9న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. డిసెంబరు 10 నుంచే కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేస్తోందని స్పష్టంగా చెప్పారు.
Congress Bus Yatra in Telangana : రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు చొప్పున ఇస్తామని డీకే శివకుమార్ తెలిపారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పింఛను ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంటిస్థలం లేని పేదలకు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇస్తామని.. అలాగే విద్యార్థులకు యువ వికాసం కింద రూ.5 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. డిసెంబరు 3 తర్వాత కేసీఆర్ కుటుంబం తన ఫామ్ హౌస్‌లో విశ్రాంతి తీసుకోక తప్పదని అన్నారు.
"కర్ణాటక ప్రకటించిన హామీలు అన్ని అమలు చేస్తున్నాం. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రకటించిన హామీలను నేరవేర్చారా అని తెలంగాణ ఓటర్లను ప్రశ్నించాను. కేసీఆర్, కేటీఆర్‌లను అడుగుతున్నాను. ఒక బస్సును ఏర్పాటు చేస్తాను.. మీ మంత్రులతో కలసి కర్ణాటకు రండి. ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లే వెళ్దాం. మేం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం. మీరిచ్చిన హామీలు అమలు చేయట్లేదని చెబుతున్నారు. తెలంగాణ వాసుల బంధువులు.. కర్ణాటకలో ఉన్నారు వారిని అడగండి." - డీకే శివకుమార్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి
కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా 1.10 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2 వేలు అందిస్తున్నామన్నారు. అక్కడ హామీ ఇచ్చిన ప్రకారం పేదలకు 10 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. కర్ణాటకలో మహిళలు అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు. అదే విధంగా తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సమావేసంలో రేవంత్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ యాత్ర తాండూర్, పరిగి, చేవెళ్లలో కొనసాగనుంది.
Revanth Reddy Fires on CM KCR : కాంగ్రెస్ గెలుస్తుందని కేసీఆర్‌కు ముందే తెలిసే.. విశ్రాంతి తీసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తన ఓటమిని అచ్చంపేటలో ముందే ఒప్పుకున్నారన్నారు. ఐదేళ్ల పాలనలో రుణమాఫీ పూర్తి చేయని ఈ ప్రభుత్వం.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా అనే అబద్ధం.. సాగుకు ఎక్కడా 8 నుంచి 10 గంటలకు మించి కరెంటు ఇవ్వట్లేదని చాలెంజ్ విసిరారు.
Rahul Gandhi Jagtial District Tour : రాహుల్ గాంధీని చూసేందుకు పోటెత్తిన ప్రజలు.. ఫొటోస్ చూశారా