సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ప్రసాద్ విమర్శించారు. వికారాబాద్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రసాద్ మద్దతు తెలిపారు. సమ్మెలో భాగంగా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కార్మికులు మానవహారం చేపట్టి ఆందోళన చేశారు. వికారాబాద్ డెవలప్మెంట్ ఫోరం, టీఆర్టీఎఫ్ తదితర సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం మొండి వైఖరితో... కార్మికుల పోరాటాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి మండిపడ్డారు. ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్ స్పందించకపోవటం దారుణమన్నారు.
ఇవీ చూడండి: సమ్మెలో కార్మికలోకం... సర్కారు చర్చల సంకేతం!