Vikarabad Collectorate వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఎన్నేపల్లి వద్ద 36 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.61 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కలెక్టరేట్ భవనాన్ని సకల సౌకర్యాలతో ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 42 విభాగాలు ఇక్కడ నుంచి పని చేయనున్నాయి. అంతకుముందు వికారాబాద్ తెరాస కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ తన చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం వైద్య కళాశాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పరిగి, వికారాబాద్‌కు డిగ్రీ కళాశాలలు మంజూరు చేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి నేరుగా బహిరంగ సభ వేదికకు చేరుకుని మాట్లాడారు. 'ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి వస్తే రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్‌లో పెట్టాలని కోరేవారు. ఇప్పుడు వికారాబాద్‌నే జిల్లాగా చేసుకొని కలెక్టరేట్‌ను అద్భుతంగా కట్టుకొని ప్రారంభించుకున్నాం. వికారాబాద్‌కు గొప్ప చరిత్ర ఉంది. వికారాబాద్‌కు వైద్య కళాశాల, డిగ్రీ కళాశాల మంజూరైంది. తెలంగాణ రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా అని ప్రజలు ఆలోచించాలి. గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో, ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఆలోచించాలి. ప్రతి గ్రామంలోని ప్రజలు ఆలోచించి చర్చించుకోవాలి. ఆనాడు రంగారెడ్డి జిల్లాలోని కొంతమంది సమైక్యవాదుల తొత్తులు భూముల ధరలు పడిపోతాయని దుష్ప్రచారం చేశారు. తెలంగాణలో ఈరోజు ఒక ఎకరం అమ్మితే.. పొరుగు రాష్ట్రాల్లో నాలుగు ఎకరాలు కొంటున్నారు. మంచినీళ్ల కోసం ఎంతో గోసపడ్డారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. 55 ఏళ్లున్న వారికి కొత్తగా నిన్నటి నుంచే పింఛన్లు అందిస్తున్నాం. భవిష్యత్‌లో ప్రజల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం.' అని సీఎం స్పష్టం చేశారు.
ఇవీ చూడండి..
Students Joy Ride in Hyderabad Metro హైదరాబాద్ మెట్రోలో విద్యార్థుల జాయ్ రైడ్
LIVE వికారాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన
ప్రాక్టీస్ సెషన్లో పల్టీలు కొట్టిన కబడ్డీ ప్లేయర్, తలకు తీవ్ర గాయంతో మృతి