వికారాబాద్ జిల్లా పరిగి మండలం మదారం సమీపంలోని ఓ మొక్కజొన్న చేనులో మట్టి గుంత కలకలం రేపింది. భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గుంతను పరిశీలించారు. గుంతలో ఎవరినైనా పాతిపెట్టి ఉంటారని పూర్తిగా తవ్వించారు. ఏమీ లేకపోవడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. రాత్రి లేని గుంత తెల్లవారే సరికి ఉండటం వల్ల భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. గుంత ఎవరు తీశారు, ఎందుకు తీశారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చూడండి 40 రోజుల పసికందును గొంతు కోసి చంపిన తల్లి