ETV Bharat / state

'మూగజీవాలు ఆకలితో అలమటించొద్దు' - చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్​ స్వామి

కరోనా మహమ్మారి సమాజంలోని అన్ని వ్యవస్థలపై తీవ్రమైన ప్రభావం చూపింది. మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా గ్రాసం దొరక్క అల్లాడిపోతున్నాయి. ముఖ్యంగా గోశాలలో ఉన్న గోవులకు గ్రాసం దొరకడంలేదు. చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్​ స్వామి 300 పశువులకు గ్రాసం సమకూర్చి దాతృత్వం చాటుకున్నారు.

Chillukur Balaji Temple chief priest Rangarajan Swamy of  donated food to 300 cattle in Vikarabad district
గో సేవ సమాజ హితం
author img

By

Published : Jun 4, 2020, 7:57 PM IST

పేదలను ఆదుకున్నట్లే, ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న మూగజీవాలనూ ఆదుకోవాలని చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులు రంగరాజన్ స్వామి పేర్కొన్నారు. వికారాబాద్​ జిల్లా శంకర్​పల్లి మండలం పొద్దుటూరు గ్రామ సమీపంలో గల గోశాలలో 300 ఆవులకు పశుగ్రాసం సమకూర్చి దాతృత్వం చాటుకున్నారు.

గో మాత ఆకలిని తీర్చడం ప్రతి ఒక్కరి ధర్మం, బాధ్యతని పేర్కొన్నారు. గో సేవ చేస్తే కరోనా నుంచి బయటపెడతామని వెల్లడించారు. ప్రతి భక్తుడు గోవులకు కావాల్సిన గడ్డి, చెరకు పిప్పి వంటివి సమకూర్చాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.