ETV Bharat / state

వికారాబాద్​ జిల్లాలోని అన్ని పంచాయతీలకు టీవీల అందజేత - విద్యార్థుల చదువుకోసం ఎంపీ రంజిత్​ రెడ్డి సహాయం

వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి తన సొంత నిధులతో టీవీ అందజేయనున్నామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతో టీవీలను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే ఐటీ మంత్రి కేటీఆర్... రాష్ట్రాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

ఏ విద్యార్థి చదువుకు ఆటంకం కలగకూడదు: చేవేళ్ల ఎంపీ

author img

By

Published : Aug 31, 2020, 6:36 PM IST

వికారాబాద్ జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి తన సొంత నిధులతో టీవీ అందజేయనున్నామని చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. దాదాపు ఒక్కొక్క టీవీ ఖరీదు రూ. పది వేల చొప్పున ఆ మొత్తం నిధుల చెక్కును హైదరాబాద్ ప్రగతి భవన్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు చదువుకు దూరమైన దృష్ట్యా... ప్రభుత్వం "ఆన్ లైన్"లో తరగతులు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఎంపీ తెలిపారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతో టీవీలను అందజేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఐటీ మంత్రి కేటీఆర్... రాష్ట్రాన్ని డిజిటలైజేషన్ దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీలో టీవీలను పరిపాలన నిర్వహణ కోసం వీడియో కాన్ఫరెన్స్, సమాచార విభాగలుగా ఉపయోగించుకోవాలని స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎంపీ రంజిత్ సూచించారు.

ఇదీ చదవండి: 'కొవాగ్జిన్'​ రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.