ETV Bharat / state

ఉద్యోగాలన్నీ కేసీఆర్​ కుటుంబానికే: కె. లక్ష్మణ్​ - వికారాబాద్​ జిల్లా తాజా వార్తలు

పోరాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్​ కుటుంబం పాలిస్తోందని భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ ఆరోపించారు. వికారాబాద్​లో జరిగిన భాజపా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

bjp obc morcha president k laxman fire on cm kcr family in vikarabad
రాష్ట్రంలో కుటుంబ పాలన: లక్ష్మణ్​
author img

By

Published : Jan 18, 2021, 8:42 PM IST

ఏడేళ్లుగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడుతున్నారని భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​ అన్నారు. ఇంటికో ఉద్యోగమన్న కేసీఆర్​ తన ఇంటికే ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, బిడ్డ ఎమ్మెల్సీ, బంధువు రాజ్యసభ సభ్యుడు ఇలా అన్ని ఉద్యోగాలు కేసీఆర్​ కుటుంబానికే వచ్చాయన్నారు.

త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణను ఒక కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని ఆరోపించారు. అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని చెప్పారు. ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారు.. మూడెకరాలు భూమి ఇస్తామన్నారు. ఈ హామీలు అమలు కాలేదన్నారు. కేసీఆర్​ కుటుంబ పాలనను కూల్చేయడానికి బడుగుబలహీన వర్గాల వారంతా భాజపాలో చేరుతున్నారని అన్నారు.

ఇదీ చదవండి: 'న్యాయ సిబ్బందికి కొవిడ్​ టీకాపై ఎలాంటి ఆదేశాలివ్వలేం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.