ETV Bharat / state

వైభవోపేతం... భావిగి భద్రేశ్వర స్వామి రథోత్సవం - vikarabad

వికారాబాద్​ జిల్లా తాండూరులో కొలువై ఉన్న భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో భాగంగా స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవ మూర్తులను దర్శించుకున్నారు.

bhadreshwara
author img

By

Published : Apr 28, 2019, 11:40 AM IST

వికారాబాద్​ జిల్లా తాండూరులో వెలసిన భావిగి భద్రేశ్వరస్వామి జాతర మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఏటా చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం నుంచి తొమ్మిది రోజులపాటు స్వామివారి జాతర నిర్వహించటం ఆనవాయితీ. వేడుకల్లో ప్రధానమైన ఘట్టాలు స్వామివారి రథోత్సవం, లంకా దహనం. శనివారం అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. రథం ముందు కళాకారుల విన్యాసాలు ఆద్యంతం అలరించాయి.

రథం ముందు పూర్ణకుంభంతో మంగళహారతి ఇచ్చిన అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో రుద్రేశ్వర ఆలయం నుంచి సమీపాన ఉన్న బసవన్న వరకూ భక్తులు రథాన్ని లాగారు. జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణం విద్యుద్దీపాల అలంకరణతో మెరిసిపోతోంది.

భారీ భద్రత

జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు సునీత రెడ్డి, పురపాలక సంఘం అధ్యక్షురాలు తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

అంగరంగ వైభవంగా భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవం

ఇదీ చదవండి: ఘనంగా భద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాలు

Intro:hyd_tg_tdr_28_bhadreshwara_rathotsavam_av_c23

వికారాబాద్ జిల్లా తాండూరులోని భావిగి భద్రేశ్వరస్వామి జాతర ఉత్సవాలు భాగంగా మొదటి ప్రధాన ఘట్టం ప్రతి ఉత్సవం శనివారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది రథోత్సవానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు

Body:ప్రత్యేక ఇక్కడ అ తొమ్మిది రోజుల పాటు జాతర ఉత్సవాలు జరుగుతాయి ఉత్సవాల్లో రథోత్సవం లంక దహనం ప్రధాన ఘట్టాలు మొదటి ప్రధాన ఘట్టం రథోత్సవం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది రథం ముందు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి

Conclusion:రథం ముందు పూర్ణకుంభం తో తో మహామంగళహారతి ఇ తర్వాత స్వామివారిని రథంలో కూర్చోబెట్టి రుద్రేశ్వర దేవాలయం నుంచి సమీపంలోని బసవన్న కడదాకా భక్తులు రథాన్ని లాగుతారు భక్తుల కరతాళధ్వనుల మధ్య రథోత్సవం శోభాయమానం ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో వెళ్ళిపోయి రథోత్సవానికి జిల్లా ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రథోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సునీత రెడ్డి పురపాలక సంఘం అధ్యక్షురాలు సునీత తదితరులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.