ETV Bharat / state

బంద్ ఉద్రిక్తం.. పోలీసులు, నాయకుల వాగ్వాదం - latest news of arrest in vikarabad tsrtc band

పరిగి డిపో ఆర్టీసీ డ్రైవర్​ వీరభద్రయ్య మృతికి నిరసనగా వికారాబాద్​ జిల్లా బంద్​కు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. బంద్​లో భాగంగా ఆందోళన చేస్తున్న పలువురు నాయకులను కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.

bandh-in-vikarabad-dot-dot-dot-arrest-of-several-leaders-latest-news
author img

By

Published : Nov 23, 2019, 3:59 PM IST

​వికారాబాద్​లో బంద్... పలువురు నాయకుల అరెస్ట్​

వికారాబాద్​ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో డ్రైవర్ వీరభద్రయ్య మృతిని నిరసిస్తూ ఆర్టీసీ జేఏసీ జిల్లా బంద్​కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్​రెడ్డి, ఆర్టీసీ జేఏసీ-1 నాయకుడు హన్మంతు ముదిరాజ్​ ఆధ్వర్యంలో పరిగి ఆర్టీసీ డిపో ముందు ఆందోళన చేపట్టారు. డిపోలోని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఆందోళన చేస్తున్న రామ్మోహన్​రెడ్డి, హన్మంతులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని వారు డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.