ETV Bharat / state

వికారాబాద్​ హత్య కేసు నిందితుల అరెస్టు

తెల్లవారితే రాఖీ పండుగ...నలుగురు మిత్రులు కలిసి మద్యం తాగుతున్నారు. అందులో ఒకరు ఏడువ సాగారు..ఏమైందిరా అలా ఏడుస్తున్నావు అన్నారు అందులో  ఒకరు..రాఖీ కట్టేవారు నాకెవరున్నారురా... ఉన్న ఒక్క చెల్లెను బావ చంపాడు కదా..అన్నాడు ఆ వ్యక్తి. అంతలోనే వారంత కలసి ఓ నిర్ణయానికి వచ్చారు. మూకమ్ముడిగా దాడి చేసి అతని బావను చంపేశారు.

author img

By

Published : Aug 20, 2019, 11:45 PM IST

వికారాబాద్​ హత్య కేసు నిందితుల అరెస్టు

వికారాబాద్​ జిల్లా కేంద్రంలో ఓ హత్య సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 14న పుట్ట వెంకటేశ్​ తన మిత్రులతో కలిసి మద్యం తాగుతున్నాడు. అంతలోనే ఏడవడం ప్రారంభించాడు...ఏమైందిరా అని వారు అడగగా.. నాకు రాఖీ కట్టే వారు ఎవరున్నారు రా.. ఉన్న ఒక్క చెల్లెను బావ చంపేశాడు కదా అని బదులిచ్చాడు. అంతలోనే వారంత ఓ నిర్ణయానికి వచ్చి...అతని బావ సత్యనారాయణ వద్దకు వెళ్లారు. బావ మందు తాగిపియ్యవా..అని అడిగాడు వెంకటేశ్​ ..సరే అన్నాడు ఆయన. ఇద్దరు కలిసి ఓ చోట తాగడం ప్రారంభించారు. అనంతరం సిగరెట్ల కోసం ఓ దుకాణానికి వెళ్లారు. అక్కడ బావతో గొడవ పెట్టుకుని మిత్రులతో కలసి చితకబాదాడు. సరిగ్గా ఆ సమయంలోనే వచ్చాడు సత్యనారాయణ మేన బావ వచ్చి ఆ గొడవను ఆపి అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించాడు. ఆటోలో వారు వెళుతున్నారు... మార్గమధ్యంలోనే ఆపేసి అతని ప్రాణాలు పోయేదాకా​ కొట్టారని...సీఐ శ్రీనివాస్​ రావు వెల్లడించారు.

వికారాబాద్​ హత్య కేసు నిందితుల అరెస్టు

ఇదీచూడండి:జలంధర్​ జలమయం... రంగంలోకి ఎన్​డీఆర్​ఎఫ్​

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.