ETV Bharat / state

జోరుగా వ్యవసాయ పనులు.. తప్పని కూలీల కొరత - వికారాబాద్‌ జిల్లా తాజా వార్తలు

వరుణుడు ఈసారి సకాలంలో కరుణించాడు. రైతులు విత్తనాలు నాటడం వల్ల పొలాలు కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా పనులు జోరుగా సాగుతున్నాయి. పత్తి, కంది, జొన్న తదితర పొలాల్లో కలుపు నివారణ చేపట్టడంతోపాటు ఎరువులు చల్లుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంట దిగుబడిపై ఆశలు రేకెత్తిస్తున్నా.. గతేడాది కంటే కూలీ ఖర్చులు పెరుగుతున్నందున అన్నదాతలను కొంత ఆందోళనకు గురి చేస్తోంది.

జోరుగా వ్యవసాయ పనులు.. తప్పని కూలీల కొరత

author img

By

Published : Aug 1, 2020, 1:44 PM IST

ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి..

వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌, తాండూరు, పరిగి, వికారాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రధానంగా వ్యవసాయమే జీవనాధారం. ఎంతో మంది రైతులు, కూలీల కుటుంబాలకు చెందిన వారు అనేకం భూమిని నమ్ముకుని బతుకుదెరువు సాగిస్తున్నారు. ప్రస్తుతం వానాకాలం సీజన్‌ పనులు ప్రారంభం కావటం వల్ల అన్ని మండలాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి.

తాండూరు, కొడంగల్‌ ప్రాంతాల్లో కంది అధికంగా సాగు చేస్తుండగా వికారాబాద్‌, పరిగి నియోజక వర్గాల పరిధిలో పత్తి పంటను ఎక్కువగా వేశారు. పొలం పనులకు డిమాండ్‌ పెరగటంతో కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం కలుపు నివారణ, సాళ్లల్లో దంతెలు పట్టడం, కూరగాయల మొక్కలు, వరి నాట్లు వేయటం వంటి పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో రైతులకు కూలి ఖర్చులు భారంగా మారాయి. పొలం పనులు చేసేందుకు నిత్యం దినసరి కూలీకి రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించాల్సి వస్తుంది.

పత్తి, మొక్కజొన్న తదితర పంటలకు మందు పిచికారీ చేయాల్సి ఉంటే పురుషులకు ఒక్కరికి రూ.500తోపాటు బత్త రూ.80 చెల్లిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఎకరం పత్తిలో కలుపు తీయాలంటే రూ.4000 నుంచి రూ.6000 వరకు అవుతోంది. పొలంలో దంతె పట్టాలంటే ఎకరానికి రూ.700 వరకు తీసుకుంటున్నారు. స్థానికంగా కూలీలు రాకుంటే ఇతర గ్రామాల నుంచి రప్పించుకుంటున్నారు. వారిని రానుపోను రవాణా ఖర్చులు రూ.500 నుంచి రూ.1000 వరకు అవుతోంది. జిల్లాలో సాధారణ సాగు 4.10 లక్షల ఎకరాలు ఉండగా ప్రస్తుతం 3.30 లక్షల ఎకరాలు సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.

తల్లిదండ్రులకు చేదోడుగా..

కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు బంద్‌ అయ్యాయి. దీంతో పిల్లలు పొలం వద్ద తల్లిదండ్రులకు సాయం చేస్తున్నారు. చాలామంది పొలం బాటపడుతూ పనుల్లో నిమగ్నమయ్యారు. తల్లిదండ్రులకు సహకరిస్తూ పనులు చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ అమ్మానాన్నలకు తోడుగా ఉన్నందున ఖర్చులు తగ్గిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండటం వల్ల ఇప్పట్లో బడులు తెరిచే అవకాశం కనిపించడం లేదు. ప్రభుత్వం తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రత్యేకంగా ఓ లింక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంపుతూ అభిప్రాయాలను తెలుసుకుంటోంది.

నిత్యం మాతోనే పొలానికి..

గ్రామాల్లో అందరి దగ్గర ఒకేసారి పనులు ఉన్నందున కూలీలకు బాగా డిమాండ్‌ ఏర్పడింది. ఇతర గ్రామాల నుంచి తెప్పిస్తే కూలి అధికంగా అడుగుతున్నారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలలు లేకపోవటం వల్ల పిల్లలు పనులు చేస్తూ సహాయపడుతున్నారు. నిత్యం మా వెంట పొలానికి వస్తున్నారు. రెండు ఎకరాల వరకు విత్తనాలు వేయగలిగాం. కూలీల ఖర్చు తగ్గుతున్నా వారు విద్యాపరంగా నష్టపోతున్నారనే ఆవేదన కలుగుతోంది. పాఠశాలలు పునఃప్రారంభం అయితే బాగుంటుంది.

- రాములు, రైతు, కండ్లపల్లి

కూలి ఎక్కువ అడుగుతున్నారు..

నాకున్న ఐదెకరాల్లో ఈసారి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. మరో ఎకరంలో జొన్న వేశా. ఇటీవల వర్షాలు కురుస్తుండటం వల్ల సాళ్ల మధ్య కలుపు విపరీతంగా వచ్చింది. దీంతో పక్క గ్రామం నుంచి కూలీలను రప్పించుకుని విత్తనాలు వేసే పనులు పూర్తి చేయించా. కూలీలు గత ఏడాది కంటే అధికంగా అడుగుతున్నారు. రెండేళ్లుగా రోజుకు రూ.200 చెల్లించేది ప్రస్తుతం రూ.300 ఇవ్వటంతోపాటు అదనంగా ఆటో ఛార్జీలు అవుతున్నాయి.

- జంగయ్య, రైతు, మేడిపల్లికలాన్‌

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.