వికారాబాద్ పట్టణానికి చెందిన మాణిక్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన టాటా సుమో వాహనాన్ని అద్దె ప్రాతిపదికన ఆబ్కారీ కార్యాలయంలో ఉంచి తానే చోదకుడిగా చేరాడు. వాహనానికి సంబంధించిన అద్దె బిల్లులు రెండేళ్లకు పైగా ఇవ్వలేదు. విసిగి వేసారి నిరసన తెలపాలని సెల్ టవర్ ఎక్కాడు.
అయితే టవర్‌పై ఎప్పటి నుంచో ఉన్న తేనెతీగలు కదిలి అతడ్ని కుట్టడంతో టవర్ దిగివచ్చాడు. స్వల్ప గాయాలు కావడంతో బాధితున్ని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు.
ఇదీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా