పశువుల దాణా కోసం వినియోగించే విత్తనాలను తీసుకొచ్చి నాణ్యమైన కంపెనీ ప్యాకెట్లలో నింపి నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను వికారాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 27 క్వింటాళ్ల పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ వెల్లడించారు.
పేరుగాంచిన కంపెనీలకు చెందిన 4000 ఖాళీ కవర్లను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వీరికి ఖాళీ కవర్లను సరఫరా చేస్తున్న రవి అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతన్ని త్వరగా పట్టుకొని రిమాండ్కు తరలించనునట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాల పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.