వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్లలో విషాదం చోటుచేసుకుంది. 11 నెలల పసిబిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మల్లిక శనివారం సాయంత్రం తన 11 నెలల పసి బాలుడ్ని చంపి.. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లీ కొడుకులు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య - latest news on 11 month old baby killed by mother in vikarabad district
11 నెలల పసిబిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం కుదురుమళ్లలో విషాదం చోటుచేసుకుంది. 11 నెలల పసిబిడ్డను చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మల్లిక శనివారం సాయంత్రం తన 11 నెలల పసి బాలుడ్ని చంపి.. ఆ తర్వాత తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లీ కొడుకులు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చూడండి:- లక్ష్మణరేఖ దాటకుండా కరోనాను జయిద్దాం