ETV Bharat / state

అవసరానికి మించి కొంటున్నారు... ఒక్కనెలలోనే రెట్టింపు

కొవిడ్‌ దెబ్బకు ఉపాధి కోల్పోయి.. వ్యాపారాలు డీలాపడి విలవిలలాడుతున్నా సరే.. ‘బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు’ అనుకుంటున్న జనం మందుల కోసం కోట్లాది రూపాయల సొమ్ము ధారపోస్తున్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో.. కరోనా ఔషధాల విక్రయం ఒక్కసారిగా అనూహ్యంగా పెరిగింది.

covid-drugs-buying-more-than-necessary-in-telangana
అవసరానికి మించి కొంటున్నారు... ఒక్కనెలలోనే రెట్టింపు
author img

By

Published : Apr 22, 2021, 7:58 AM IST

కరీంనగర్‌లోని ఒక చిన్న మందుల దుకాణంలో సాధారణంగా రోజుకు రూ. 40-50 వేల విలువైన ఔషధాల అమ్మకాలు జరుగుతుంటాయి.. గత నెల రోజుల నుంచి రోజుకు రూ.లక్షకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి.

‘రాష్ట్రంలో సాధారణంగా నెలకు రూ. 800 కోట్ల విలువైన ఔషధ అమ్మకాలు జరిగేవి. గత నెల రోజుల్లో రూ. 1500 కోట్లకు చేరాయి. ఔషధాలు కాకుండా పల్స్‌ ఆక్సీమీటర్‌, డిజిటల్‌ థర్మామీటర్‌, వేపరైజర్‌ తదితర పరికరాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి.

హైదరాబాద్‌లోని ఒక పెద్ద ఔషధ దుకాణంలో సాధారణ రోజుల్లో రోజుకు రూ. 30- 40 లక్షలు విక్రయాలు జరుగుతుంటాయి.. గత 4 వారాల్లో ఏకంగా రోజుకు రూ. కోటికి పైగానే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

కేవలం గత నాలుగు వారాల్లోనే రాష్ట్రంలో దాదాపు రూ. 1500 కోట్ల విలువైన వివిధ రకాల మందుల్ని ప్రజలు కొనేశారు. అందులో దాదాపు రూ. 700 కోట్లకు పైగా కేవలం కొవిడ్‌ ఔషధాలకే వెచ్చించారంటే అతిశయోక్తి కాదు. మార్చి నెలతో పోల్చితే.. ఏప్రిల్‌లో సాధారణం కంటే రెట్టింపు పైగా విక్రయాలు జరిగాయి. దీన్నిబట్టి ఎంతమంది ప్రజలు కొవిడ్‌ బారినపడ్డారో అర్థమవుతోంది. కొందరు ముందుజాగ్రత్తగా కూడా విటమిన్‌ మాత్రలను వాడుతున్నారు. మరికొందరు మళ్లీ ఔషధాలు దొరుకుతాయో.. దొరకవో అనే భయాందోళనలతో ఒకేసారి రెండుమూడు నెలలకు సరిపడా కొనేస్తున్నారు. దీనివల్లనే ఔషధాల విక్రయాలు గణనీయంగా పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.

వైద్యఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. సరిగ్గా నెల రోజుల కిందట అంటే మార్చి 20న రాష్ట్రంలో 64,898 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరగ్గా, 394 కొత్త కేసులు నమోదయ్యాయి. అప్పటికి 2,804 మంది మాత్రమే కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. సరిగ్గా నెల తర్వాత అంటే ఏప్రిల్‌ 20 నాటికి పరిస్థితి మారిపోయింది. రోజుకు 1,30,105 పరీక్షలు చేయగా.. కొత్తగా 6,542 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా 46,488 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. అంటే.. వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పని మనుషులు.. ఇలా సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు కూడా కొవిడ్‌కు సంబంధించిన ఇతర ఔషధాలను వినియోగించాల్సిందే. ఈ లెక్కన ఒక్కొక్క బాధితునికి కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలుపుకొని కనీసం 10 మంది ఉంటారనుకున్నా.. రాష్ట్రంలో సుమారు 4.65 లక్షలమంది కొవిడ్‌కు సంబంధించిన ఏదో ఒక రకమైన ఔషధాలను వాడుతూ ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వీరు కాకుండా ముందు జాగ్రత్తగా విటమిన్‌ మాత్రలు వాడే వారి సంఖ్య లెక్కే లేదు.

ఇదే అదనుగా ధరలు పైపైకి..

* సాధారణ రోజుల్లో రూ. 250 విలువ ఉండే పల్స్‌ ఆక్సీమీటర్‌ను ఇప్పుడు ఏకంగా రూ. 2,000, రూ. 2,500, కొన్ని కంపెనీలవైతే రూ. 3,500కు కూడా విక్రయిస్తున్నారు.
* డిజిటల్‌ థర్మామీటర్‌ సాధారణ రోజుల్లో రూ. 80-100కు విక్రయిస్తుండగా.. ఇప్పుడు రూ. 200-250 వరకూ అమ్ముతున్నారు.
* ఇలా రాష్ట్రంలో నెల రోజుల్లోనే దాదాపు రూ. 300 కోట్ల విలువైన ఈ పరికరాలను విక్రయించినట్లు తెలుస్తోంది.

ఎక్కువగా కొంటున్న ఔషధాలు

* యాంటీ బయాటిక్స్‌: డాక్సిసైక్లిన్‌, అజిథ్రోమైసిన్‌, సెఫిక్జిమ్‌
* యాంటీ హిస్టమిన్‌: మోంటెలూకాస్ట్‌, ఆంబ్రోక్సిల్‌, లెవోసిట్రిజిన్‌, ఎసెటైల్‌సిస్టెయిన్‌
* కార్టికోస్టెరాయిడ్స్‌: డెక్సామెథజోన్‌, మిథైల్‌ప్రెడ్నిసలోన్‌, డెఫ్లూజకొర్ట్‌
* ఇతర మందులు: ఐవర్‌మెక్టిన్‌, దగ్గు మందులు, కాల్షియం, జింక్‌, విటమిన్‌-సి, విటమిన్‌-డి, మల్టీవిటమిన్‌, పాంటప్రొజోల్‌, రానిటిడిన్‌ వంటి అసిడిటీ మాత్రలు, అపిక్సాబాన్‌, ఆస్పిరిన్‌, ఎనోక్సాపారిన్‌ వంటి రక్తం చిక్కబడకుండా ఇచ్చే మాత్రలు, పారాసెటమాల్‌ వంటి జ్వరం మాత్రలు.

అవసరాలకు కొనడమే మేలు

ఔషధ దుకాణదారుల సంఘం అధ్యక్షుడు

రాష్ట్రంలో గత నెల రోజుల్లో ఔషధ విక్రయాలు గణనీయంగా పెరిగాయని జీహెచ్​ఎంసీ ఔషధ దుకాణదారుల సంఘం అధ్యక్షుడు అరుగొండ శ్రీధర్ తెలిపారు. కొందరు అవసరాలకు మించి కూడా కొంటున్నారని వెల్లడించారు. దీనివల్ల నిజంగా అవసరమైన వారికి మందులు లభ్యం కాని పరిస్థితులు ఎదురవుతాయని తెలిపారు. కొవిడ్‌ చికిత్సలో వినియోగించే అన్ని రకాల మందులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని... ఎటువంటి కొరత లేదు. కాబట్టి అవసరాన్నిబట్టి కొనడమే మేలని అంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 78 శాతం ప్రభావవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.