ETV Bharat / state

కీలక సమస్యలపై కాంగ్రెస్ కమిటీలు: కుంతియా - రాష్ట్రంలోని పలు అంశాలపై విచారణ కమిటీలు

తెలంగాణలో యురేనియం తవ్వకం, ప్రాజెక్టుల అంచనాల పెంపు అవినీతిపై పలు కమిటీలు వేశామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్​సీ కుంతియా తెలిపారు.

కమిటీల నివేదికలు వచ్చాకే కార్యచరణ ప్రకటిస్తాం : కుంతియా
author img

By

Published : Sep 8, 2019, 7:11 PM IST

Updated : Sep 8, 2019, 7:34 PM IST

రాష్ట్రంలోని పలు అంశాలపై విచారణ కమిటీలను ఏర్పాటు చేసినట్లు పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్‌సీ కుంతియా అన్నారు. ఈ కమిటీలు రెండు నెలల్లో అధ్యయనం చేసి ఇచ్చే నివేదికలను గవర్నర్​కు సమర్పిస్తామని కుంతియా వెల్లడించారు. అవినీతిని సహించమని చెప్తున్న కేంద్రానికి నివేదికలు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరుతామని స్పష్టం చేశారు.

యురేనియం తవ్వకంపై హన్మంతరావు అధ్యక్షతన కమిటీ వేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అంచనాల పెంపు అవినీతిపై మరో కమిటీ వేశామని చెప్పారు. ఈ కమిటికీ ఛైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కన్వీనర్‌గా భట్టి విక్రమార్క వ్యవహరిస్తారని వివరించారు. యాదాద్రి శిలలపై కేసీఆర్, కారు బొమ్మ చెక్కడం అప్రజాస్వామికమన్నారు.

కమిటీల నివేదికలు వచ్చాక కార్యచరణ: కుంతియా

ఇవీ చూడండి : 'కాంగ్రెస్​ పాలనలోనే ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది'

Last Updated : Sep 8, 2019, 7:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.