ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్‌తో చేపట్టిన భాజపా నేతల ఆందోళన అరెస్టులకు దారితీసింది. తొలుత భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ రైతులతో కలసి తన ఇంటి ముందు నిరసన తెలిపారు.
ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో రోడ్డుపైనే జొన్నలు పోసి తగులపెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడి చేరుకుని రైతులంతా ఇళ్లకు వెళ్లాలని, లేదంటే కేసులు పెడతామని హెచ్చరించారు.
ముట్టడికి యత్నం..
భాజపా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి యువకులతో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. రేపటి మంత్రివర్గ సమావేశంలో జొన్నల కొనుగోలుపై ప్రకటన చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.