ETV Bharat / state

బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు

మూగవాడైతేనేం చేతులతో రాసి చూపిస్తాడు. చెవులు వినపడక పోతేనేం మనం చెప్పేది అర్థం చేసుకుంటూ సమాధానమిస్తాడు. అంతేనా వాడి పడేసిన బాటిళ్లు, పాస్టిక్ డబ్బాలతో అందమైన బొమ్మలు తయారు చేస్తూ అందరి చేత ఔరా అనుపిస్తున్నాడు ఈ బుడతడు. అగ్గిపెట్టలు, అగ్గి పుల్లలతో కూడా భిన్న ఆకృతుల్లో రూపాలను తీర్చిదిద్దుతున్నాడు. పెన్సిల్​తోనే ప్రకృతిని పేపరు మీదికెక్కిస్తున్నాడు. అందమైన రంగులద్దుతూ అదరహో అనిపిస్తున్నాడు.

బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు
author img

By

Published : May 31, 2019, 4:11 PM IST

బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు

సూర్యాపేట జిల్లా నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గద్దల వెంకటేశ్వర్లు, స్వప్నకు ముగ్గురు సంతానం. అందులో రెండో వాడు గద్దల యశ్వంత్. ప్రస్తుతం ఆరో తరగతి పూర్తైంది. యశ్వంత్ పుట్టిన కొన్నాళ్లకే నిమోనియాతో ఆస్పత్రిలో చేరాడు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల రియాక్షన్ అయి మాటలు రాకపోవడమే కాకుండా చెవులు వినపడటం లేదు. అప్పటి నుంచి కుమారుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన తల్లిదండ్రులను కలచివేసింది. ఎలాగైనా సరే కొడుకును బాగా చదివించాలనుకొని పాఠశాలకు పంపించారు. తోటి విద్యార్థులతో ఇబ్బందులు కలిగాయి. అది తట్టుకోలేక తనలాంటి పిల్లలున్న పాఠశాలకు పంపించాలని హైదరాబాద్​లోని శ్రీనగర్ కాలనీలో అక్షయ్ ఆకృతి పాఠశాలలో చేర్పించారు.

ఎన్నో బహుమతులు గెలిచాడు...

యశ్వంత్​కు మాటలు రాకపోయినా రాసి చూపిస్తాడు. చెవులు వినపడకపోయినా మనం చెప్పేది అర్థం చేసుకొని సమాధానం చెప్తాడు. చదువులో రాణిస్తూనే సాంసృతిక పోటీలలో పాల్గొంటున్నాడు. పాఠశాలలో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచే యశ్వంత్​కు బొమ్మలు వేయడం ఇష్టం. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు అట్ట ముక్కలతో ఇంట్లో వాడే పాత్రలు లాంటివి తయారు చేసే వాడు. ప్రస్తుతం యూట్యూబ్​లో చూస్తూ అగ్గిపెట్టలు, అగ్గిపుల్లలు, వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలతో అందమైన ఆకృతుల్లో బొమ్మలు తయారు చేస్తున్నాడు. అంతేకాకుండా తోటి పిల్లలకు నేర్పిస్తున్నాడు.

మాకిప్పుడు బెంగ లేదు

బధిరుడైన తమ కుమారుడు భవిష్యత్తులో ఎలా ఉంటాడో, ఏమైతాడోననే బెంగ ఉండేదని... ప్రస్తుతం యశ్వంత్ కనబరుస్తున్న ప్రతిభ వల్ల దిగులు లేకుండా పోయిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కొడుకు ఇలా అందరి మన్ననలు పొందడానికి కారణం పాఠశాల యాజమాన్యమేనని చెబుతున్నారు. పిల్లలకు ఎలాంటి వైకల్యం ఉన్నా... వారిలో ఏదో కళ ఉంటుందని దానిని గర్తించి శిక్షణనిప్పిస్తే మంచి స్థాయికి చేరుకుంటారని చెబుతున్నారు స్వప్న, వెంకటేశ్వర్లు.

ఇవీ చూడండి: హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.