ETV Bharat / state

'పల్లెల పరిశుభ్రత కోసం ట్రాక్టర్ల పంపిణీ' - ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ తాజా వార్త

గ్రామ పంచాయతీల అభివృద్ధి, పల్లెల పరిశుభ్రతే ధ్యేయంగా సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామపంచాయతీలకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ ట్రాక్టర్లను పంపిణీ చేశారు. వాటిని సొంత లాభం కోసం కాకుండా గ్రామాల అభివృద్ధికి వాడాలని చెప్పారు.

tractors distribution in suryapet district
'పల్లెల పరిశుభ్రత కోసం ట్రాక్టర్ల పంపిణీ'
author img

By

Published : Feb 12, 2020, 8:57 AM IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలోని పలు గ్రామ పంచాయతీలకు 12 ట్రాక్టర్లను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు. 30 రోజుల పల్లె ప్రగతిలో భాగంగా పల్లెలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించేందుకు, హరితహారంలోని మొక్కలకు కాపాడేందుకు ట్రాక్టర్లను ప్రతి గ్రామ పంచాయతీకి పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సొంత లాభాల కోసం ట్రాక్టర్లను ఉపయోగించకుండా గ్రామానికి ఉపయోగపడే విధంగా చూడాలని సర్పంచులకు ఎమ్మెల్యే సూచించారు. ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించి అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే మొదటిస్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్​కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

'పల్లెల పరిశుభ్రత కోసం ట్రాక్టర్ల పంపిణీ'

ఇదీ చూడండి: శరణార్థుల పల్లెల్లో.. నకిలీల బాగోతం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.