సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణములో ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 500 మంది పేద ప్రజలకు 60 క్వింటాల బియ్యం, 2క్వింటాల కూరగాయలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఉత్తమ్ అన్నారు. కరోనా పరీక్షలు మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలోనే తక్కువ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. ఐకేపీ సెంటర్లలో వసతులు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. మామిడి, నిమ్మ, బత్తాయి రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల వలసకూలీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం