కరోనాపై ప్రాణాలను ఫణంగా పెట్టి సేవ చేస్తున్న వైద్యులపై సైనికాధికారులు పూల వర్షం కురిపించారు. రాష్ట్రంలో కొవిడ్- 19 సోకిన వారికి చికిత్స అందిస్తున్న గాంధీ ఆసుపత్రి వైద్య సిబ్బందిని ఐఏఎఫ్ హెలికాప్టర్ల ద్వారా పూలతో అభినందించారు. వైద్యులు, నర్సింగ్, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందికి రక్షణ దళాల సంఘీభావం ప్రకటించాయి.
కొవిడ్ కేంద్రంగా ఏర్పాటైన గాంధీ ఆస్పత్రి.. మహమ్మారి బారి నుంచి ప్రజలను కాపాడేందుకు... అద్భుత త్యాగనిరతి ప్రదర్శిస్తున్న గాంధీ వైద్యులకు.. తెలంగాణ సమాజం సలాం చేస్తోంది.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు కృతజ్ఞతగా యోధులపై పూలవర్షం