ETV Bharat / state

100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్​... పేపర్​లోనే.. అమల్లోకాదు - tilaknagar colony members protest in suryapet district

ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ అన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన పేపర్లకే పరిమితమైందనడానికి సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లోని తిలక్​నగర్​ కాలనీయే ఉదాహరణ. తమకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ప్రకటించినా... బిల్లు కట్టలేదని తమ ఇళ్లలో కరెంట్​ నిలిపివేశారని కాలనీవాసులు ఆందోళనకు దిగారు.

tilaknagar colony members protest demanding free power below hundred units in suryapet district
100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్​... పేపర్​లోనే.. అమల్లోకాదు
author img

By

Published : Feb 12, 2020, 8:01 PM IST

100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్​... పేపర్​లోనే.. అమల్లోకాదు

ఎస్సీ ఎస్టీ కాలనీలకు 100 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి చాలా రోజులైనా.... ఇప్పటి వరకు అది అమలుకు నోచుకోలేదు.

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లోని తిలక్​నగర్​లో కరెంట్​ బిల్లు కట్టలేదని విద్యుత్​ నిలిపివేయగా... కాలనీవాసులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు ఉచిత విద్యుత్​ను ప్రకటించినా... తమ ఇళ్లలో కరెంట్​ నిలిపివేశారని అధికారులను నిలదీశారు.

తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని, ఈ విషయంలో తాము ఎలాంటి సాయం చేయలేమని అధికారులు స్పష్టం చేశారు. ఆగ్రహం చెందిన తిలక్​నగర్​ కాలనీవాసులు హుజూర్​నగర్​లోని డీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం విద్యుత్​శాఖ ఇంఛార్జికి వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇవీచూడండి: '5 నిమిషాలు రైతుల గురించే చర్చించే సమయం దొరకలేదా..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.