తెలంగాణను హరిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్‌లోని కస్తూర్బా పాఠశాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని ఆయన వెల్లడించారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. హరితహారానికి ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించామని తెలిపారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉందని.. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. రోజురోజుకూ అడవుల శాతం తగ్గుతోందని.. దీంతో వాతావరణంలో ఆక్సిజన్ శాతం పూర్తిగా తగ్గిపోయి మానవ మనుగడే ప్రశ్నార్దకంగా మారే ప్రమాదం ఉందన్నారు. ప్రతి గ్రామపంచాయతీలో రోడ్లకు ఇరుపక్కలా చెట్లను నాటి సంరక్షించాలని.. మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞంలా సాగాలని చెప్పారు.
ఇవీ చూడండి: ప్రవేశ పరీక్షలు ఆగస్టు రెండో వారంలోనే!