సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ ఆస్తులను కాపాడాలని భారతీయ జనతా యువ మోర్చా పార్టీ నాయకులు మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రధాన ద్వారం ముందు బైఠాయించి నరసన చేపట్టారు.
హుజూర్నగర్ పట్టణంలో 43 లేఅవుట్లు ఉన్నాయని.. వీటి విలువ సుమారు రూ. 300 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. రూ. 15 కోట్ల విలువైన ఆస్తుల ధ్రువపత్రాలు దొంగిలించారని వారు విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన వారే అవినీతికి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
దీనిపై పలుమార్లు కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారని.. వాటిని స్వాధీనం చేసుకుని లే అవుట్ చుట్టూ కంచె వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకోకపోతే వచ్చే నెల 10న భారీ ఎత్తున కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: మద్యం మత్తు: ఢీకొట్టిన బైక్.. మహిళ సహా బైకర్ మృతి