Telangana Young Farmer Bhukya Bichu : ఉద్యోగం రాకుంటేనేం, ఊళ్లో ఉండి నలుగురికి ఉపాధి కల్పించే ఉపాయం ఉందనుకున్నాడు ఈ యువకుడు. వినూత్నంగా ఆలోచించి వైవిధ్యభరితమైన వ్యవసాయమార్గం ఎంచుకున్నాడు. సాంకేతికత ఉపయోగించి సాగు చేస్తూ ఏటా మంచి ఆదాయం అందుకుంటున్నాడు. ఫలితంగా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించి ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు అందుకున్నాడు.
Donkey Farm : గాడిదల ఫామ్.. తెలంగాణలో తొలిసారి.. ఐడియా అదిరిందిగా..
సూర్యాపేట(Suryapet) జిల్లా తిరుమలగిరి మండలం తుమ్మలకుంట తండాకు చెందిన ఇతడు భూక్యా బీచ్చు. 2012లో బీటెక్ బయోటెక్నాలజీ పూర్తి చేశాడు. 2018 వరకు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ ఫలితం లేదు. ఉద్యోగం రాలేదని దిగులు చెందకుండా సాగు రంగం వైపు అడుగులు వేశాడు. వివిధ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్న పంటలు దిగుబడి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేశాడు.
Bhukya Bichu got ICAR National Award : వినూత్న పంటల సాగుపై దృష్టిసారించి రైతుల(Telangana Farmers) నుంచి సమాచారం సేకరించాడు బీచ్చు. ఉద్యానశాఖ(Horticulture) అందిస్తున్న రాయితీ విధానాలు తెలుసుకున్నాడు. అవగాహన వచ్చాక తనకున్న13 ఎకరాల భూమిలో కొత్త విధానంలో సాగు ప్రారంభించాడు. ఉద్యానశాఖ ఇచ్చిన 95% రాయితీతో 33 లక్షలు రూపాయలు తీసుకుని ఎకరం స్థలంలో పాలీహౌస్ ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి చామంతి మెుక్కలు తెప్పించి నాటారు.
ఈ పరికరంతో కీటకాలకు శిక్ష.. పంటకు శ్రీరామ రక్ష!
వాటిని 90 నుంచి 120 రోజులు అధికారులు పర్యవేక్షణలో వివిధ రంగుల చామంతి పూలు పెంచారు. మార్కెట్‌లో విక్రయించగా 15 లక్షలు ఆదాయం వచ్చిందని అంటున్నాడు. ప్రస్తుతం ఏటా రెండు పంటలు పండిస్తున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయం ప్రారంభించిన మెుదట్లో కరోనా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు బీచ్చు. తర్వాత వాటిని అధిగమించి పూలసాగులో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు.
సొంత ఊరిలోనే ఉంటూ వినూత్నంగా సాగు చేస్తూ ఆదాయం అందుకుంటున్నాడు. పలువురు రైతులకు, యువతకి ఆదర్శంగా నిలుస్తున్నాడు బీచ్చు. వినూత్న పంటల సాగుచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచినందుకు జాతీయ ఉత్తమ రైతుగా గుర్తింపు సంపాదించాడు బీచ్చు. ఫలితంగా ఇటీవల దిల్లీలో జరిగిన ఐకార్(ICAR) కృషి జాగరణ్‌మేళాలో ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు అందుకున్నాడు. తన శ్రమను గుర్తించి అవార్డు ఇవ్వడం ఆనందంగా ఉందంటున్నాడు.
ఉద్యోగాలు రాలేదని యువత నిరశపడకుండా ఉపాధి కల్పించే మార్గాల వైపు ఆలోచన చేయాలని చెబుతున్నాడు బీచ్చు. ఆసక్తి ఉంటే వ్యవసాయం వైపు వచ్చి వినూత్నరితీలో ఆలోచిస్తే మంచి లాభాలను పొందవచ్చంటున్నారు. సాగులో కొత్తగా వచ్చే మార్పులకు అనుగుణంగా వివిధ పంటలు సాగుచేస్తూ లాభాల బాటలో వ్యవసాయం చేస్తున్న వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందని కేవీకే శాస్త్రవేత్తలు అంటున్నారు. బయటకు వెళ్లకుండా నీడపట్టున పనిచేసుకోవడంతో పాటు సొంత గ్రామంలోనే ఉంటూ పాలీహౌస్‌లో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కూలీలు చెబుతున్నారు.
"ఉద్యోగాలు రాలేదని యువత నిరశపడకుండా ఉపాధి కల్పించే మార్గాల వైపు ఆలోచన చేయాలి. ఆసక్తి ఉంటే వ్యవసాయం వైపు వచ్చి వినూత్న రీతిలో ఆలోచిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ఇటీవల దిల్లీలో జరిగిన ఐకార్(ICAR) కృషి జాగరణ్‌మేళాలో ఉత్తమ మిలియనీర్ రైతు అవార్డు రావడం ఆనందంగా ఉంది". - భూక్యా బీచ్చు, యువ రైతు
మోటార్ లేకుండా పంట సాగు - ఎలా సాధ్యమైందబ్బా
ఆకుకూరల డాక్టర్.. ఏం తింటే ఏం లాభమో ఇట్టే చెప్పే పెద్దాయన.. 50 రకాలు సాగు