ETV Bharat / state

తెలంగాణ అంటేనే కబడ్డీ క్రీడకు ప్రసిద్ధి: శ్రీనివాస్​గౌడ్

ఈనెల 22 నుంచి 25 వరకు 47వ జూనియర్ జాతీయ కబడ్డీ టోర్నమెంట్​ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జగదీశ్​రెడ్డి తెలిపారు.

author img

By

Published : Mar 18, 2021, 5:06 AM IST

తెలంగాణ అంటేనే కబడ్డీ క్రీడకు ప్రసిద్ధి: శ్రీనివాస్​గౌడ్
తెలంగాణ అంటేనే కబడ్డీ క్రీడకు ప్రసిద్ధి: శ్రీనివాస్​గౌడ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో గుంతకండ్ల సావిత్రమ్మ మెమోరియల్‌ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 25 వరకు నిర్వహించే 47వ జూనియర్ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీని మంత్రులు శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్​ రెడ్డిలు ఆవిష్కరించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలోని ఫతే మైదాన్‌ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టోర్నమెంట్ వివరాలను మంత్రులు ప్రకటించారు

జాతీయ స్థాయి కబడ్డీ టోర్నమెంట్​ను సూర్యాపేట జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. గ్రామీణ క్రీడగా ప్రసిద్ధి చెందిన కబడ్డీని ప్రమోట్ చేయటానికి జాతీయ, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్​లు సంయుక్తంగా ముందుకు వచ్చినందుకు మంత్రి అభినందనలు తెలిపారు.

సూర్యాపేటలో నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ టోర్నమెంట్ కోసం క్రీడాకారులకు, కోచ్​లకు సౌకర్యాలను సమకూర్చుతున్నామన్నారు. 15 వేల మంది ప్రేక్షకులు వీక్షేంచేందుకు గ్యాలరీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. వీటితో పాటు పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఎల్ఈడీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ అంటేనే కబడ్డీ క్రీడకు ప్రసిద్ధని క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కబడ్డీతో పాటు వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్​తో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని రెజ్లింగ్ క్రీడలకు పెట్టింది పేరన్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గం భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.