ETV Bharat / state

Harish Rao on Suryapet Ragging Issue : 'ర్యాగింగ్ చేశారని రుజువైతే.. కఠిన చర్యలు తప్పవు' - సూర్యాపేట విద్యార్థి ర్యాగింగ్​పై హరీశ్ రావు స్పందన

Harish Rao on Suryapet Ragging Issue : సూర్యాపేట వైద్యకళాశాలలో ర్యాగింగ్ జరిగిందో..? లేదో..? తెలుసుకునేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. అలాంటి ఘటన జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

Harish Rao on Suryapet Ragging Issue
Harish Rao on Suryapet Ragging Issue
author img

By

Published : Jan 3, 2022, 11:37 AM IST

Updated : Jan 3, 2022, 12:08 PM IST

ర్యాగింగ్ చేశారని రుజువైతే.. కఠిన చర్యలు

Harish Rao on Suryapet Ragging Issue : సూర్యాపేట వైద్య కళాశాలలో జూనియర్​ విద్యార్థఇపై ర్యాగింగ్ ఘటనకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ర్యాగింగ్ విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కమిటీ ఇవాళ నివేదిక ఇస్తుందన్న మంత్రి.. ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇవాళే తేలుతుంది..

Harish Rao on Suryapet Student Ragging Issue : 'సూర్యాపేట వైద్య కళాశాలలో జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈరోజు ఉదయాన్నే వైద్యవిద్య సంచాలకులు రమేశ్​ రెడ్డికి ఆదేశాలు ఇచ్చాం. ఓ కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ ర్యాగింగ్ జరిగిందో లేదో అనే విషయాన్ని తేలుస్తుంది. ఇవాళ నివేదిక అందిస్తుంది. ఒకవేళ కమిటీ నివేదికలో ర్యాగింగ్ జరిగినట్లు తేలితే.. కఠిన చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తాం.'

- హరీశ్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి

ర్యాగింగ్ ఘటనపై విచారణ..

సూర్యాపేట వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ కలకలంపై విచారణ జరుగుతోంది. వైద్య కళాశాల వసతిగృహంలో డీఎస్పీ మోహన్‌కుమార్ విచారణ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 30 మంది విద్యార్థులను ఆరా తీస్తున్నారు. ర్యాగింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ మోహన్‌కుమార్ వెల్లడించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Last Updated : Jan 3, 2022, 12:08 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.