ETV Bharat / state

'మీ దీవెనలు ఇలానే ఉంటే ప్రజాసేవలో తరిస్తా...'

రాష్ట్ర ప్రజల దీవెనలతో తమ ప్రభుత్వం అనుక్షణం ప్రజాసేవలో తరిస్తోందని సీఎం కేసీఆర్​ తెలిపారు. హుజూర్​నగర్​ కృతజ్ఞత సభలో ప్రసంగించిన కేసీఆర్​... రాష్ట్రంలో చేపట్టిన పలు పథకాలు, చేసిన అభివృద్ధి గురించి వివరించారు. ఇప్పటికే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ... దేశానికే అదర్శంగా నిలిచామని స్పష్టం చేశారు.

TELANGANA CM KCR SPEECH IN HUZURNAGAR PUBLIC MEETING
author img

By

Published : Oct 26, 2019, 6:38 PM IST

Updated : Oct 26, 2019, 9:32 PM IST

పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కొన్ని కచ్ఛితమైన లక్ష్యాలు పెట్టుకుని ముందుకు వెళ్తూ... రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. హుజూర్​నగర్​లో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న కేసీఆర్...​ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు. సైదిరెడ్డిని రికార్డు మెజార్టీతో గెలిపించి ఇచ్చిన సందేశాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ప్రజా సేవలో అనుక్షణం తరిస్తామని ఉద్ఘాటించారు. సాగు, తాగు నీటి సమస్యను దాదాపు పరిష్కరించుకోగా... కరెంటు సమస్యను పూర్తిగా అధిగమించామన్నారు. కర్షకుల సంక్షేమం గురించి అలోచించి పెట్టిన రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలిచామని కేసీఆర్​ పేర్కొన్నారు.

'మీ దీవెనలు ఇలానే ఉంటే రాష్ట్ర ప్రజాసేవలో తరిస్తా...'

ఇవీ చూడండి: హుజూర్​నగర్​ నియోజకవర్గంపై కేసీఆర్​ వరాల జల్లు

Last Updated : Oct 26, 2019, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.