సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఈటూరు గ్రామానికి చెందిన ఓర్స మల్లయ్య, ఓర్సు అశోక్‌లు అన్నదమ్ములు. వీరిద్దరికీ భూమి వ్యవసాయ భూమి విషయంలో గొడవలయ్యాయి. మల్లయ్య తమ్ముడు అశోక్‌పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... మల్లయ్యను పీస్‌కు రప్పించిన ఎస్ఐ వారిద్దరిపై దాడి చేసినట్లు బాధితులు చెబుతున్నారు. తను చెప్పినట్లు వినాలని బెదిరించినట్లు మల్లయ్య, అశోక్‌లు ఆరోపించారు. సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు, తమ కుటుంబానికి ఎస్సై లింగం నుంచి ప్రాణహాని ఉందని... జిల్లా ఉన్నతాధికారులను కలిశారు. వారి బాధను వివరించి తమను ఎస్సై నుంచి కాపాడాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన జిల్లా ఎస్పీ... ఎస్సై లింగంను వివరణ కోరగా తాను ఎవరినీ కొట్టలేదని చెప్పినట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులే గొడవపడగ దెబ్బలు తగిలాయని... వాటిని చూపుతూ తనపై నేరం మోపుతున్నారని ఎస్సై లింగం పేర్కొన్నారు. గతంలో కూడా తనపై ఆరోపణలు చేశారని.. వారికి నేర చరిత్ర ఉందని వివరించారు.
ఇవీ చూడండి: కొవిడ్ కొమ్ములు వంచుతూ ధైర్యంగా వయోవృద్ధుల పోరాటం