ETV Bharat / state

కాలుష్య కోరల్లో సూర్యాపేట జిల్లావాసులు - polluting the environment

పచ్చని పంట పొలాలు.. ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవైన గ్రామాల్లో కొందరి స్వార్థపు ఆలోచనలు ప్రజారోగ్యాన్ని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. నిబంధనలు గాలికొదిలే వ్యాపారులు, వారికి అండగా నిలిచే అధికారుల తీరుతో.... పల్లె ప్రజలు కాలుష్యకాటుకు గురవుతున్నారు. పుట్టగొడుగుల్లాంటి రైస్‌మిల్లులు, ప్రమాణాలకు పాతరేసే యజమానులతో కాలుష్యకోరల్లో చిక్కుకుంటున్నారు సూర్యాపేట జిల్లాలోని పలుగ్రామాల ప్రజలు.

కాలుష్యకోరల్లో సూర్యాపేట జిల్లావాసులు
author img

By

Published : Aug 14, 2019, 5:22 PM IST

'బతుకుల్లో బూడిద'
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ వద్ద 30 రైస్​ మిల్లులు అనునిత్యం పొగ, బూడిద, రసాయన పదార్థాలను వెదజల్లుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ రైస్​ మిల్లర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో గాలి ఎటు వీస్తే అటు కాలుష్యం వెదజల్లుతోంది. ఈ రైస్​ మిల్లుల నుంచి వెలువడే తవుడు, పొట్టు, బూడిద సమీప గ్రామాలను కమ్మేస్తున్నాయి. భారీగా వెలువడుతున్న వ్యర్థాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.

రైస్​మిల్లులకు నిబందనలు పట్టవా?

రైస్​ మిల్లర్ల నుంచి వెలువడే కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. వాతావరణం కలుషితం కావడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటున్నారు. కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన రైస్​ మిల్లర్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలు పాటించని రైస్​మిల్లులను మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్​ చేస్తున్నారు.

తినే తిండిలో, నీళ్లలో బూడిద

పొగ, బూడిద నేరుగా ఇంట్లో పడటంతో కాళ్లకు చేతులకు నల్లగా బూడిద అంటుతుందని స్థానికులు వాపోతున్నారు. తినే ఆహారంపై కూడా పడి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెబుతున్నారు. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలుష్యకోరల్లో సూర్యాపేట జిల్లావాసులు
చర్యలు తీసుకోండి:

తమ పాలిట ప్రాణాంతకంగా మారిన రైస్‌మిల్లులపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని ప్రజలు కోరుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పాటించని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇదీ చూడండి: జమ్ములో ఆంక్షల ఎత్తివేత- కశ్మీర్​లో పాక్షికంగా అమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.