ETV Bharat / state

కోదాడలో అదనపు కలెక్టర్​ పర్యటన - కోదాడ వార్తలు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో అదనపు కలెక్టర్​ సంజీవరెడ్డి పర్యటించారు. కోదాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. జూన్​ 1 నుంచి 8 వరకు తారీఖు జిల్లాలోని అ​న్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు వందశాతం పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.

Suryapeta Collector Tour In Kodada
కోదాడలో కలెక్టర్​ పర్యటన
author img

By

Published : Jun 2, 2020, 5:17 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీలో జిల్లా అదనపు కలెక్టర్​ సంజీవరెడ్డి పర్యటించారు. జూన్​ 1 నుంచి 8 వరకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి.. సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సీజనల్​ వ్యాధులు వ్యాపించకుండా మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ.. నిల్వ నీరు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతి వార్డుల్లోమురికి కాల్వల్లో చెత్తను తొలగించడమే కాక.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటామని.. ఆ దిశగా కార్యచరణ అమలు చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఏవైనా సమస్యలు వస్తే.. వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్​ చైర్ పర్సన్​ వనపర్తి శిరీషకు సూచించారు.

ఇదీ చదవండి: 'తెలంగాణకు కేసీఆర్ దేవుడిచ్చిన వరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.