సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో లాక్డౌన్(Lock down)అమలు తీరును ఎస్పీ భాస్కరన్ (suryapet SP bhaskaran) పరిశీలించారు. అక్కడి పరిస్థితుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలని… లాక్డౌన్ను కఠినంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు సహకరిస్తే త్వరలోనే కరోనా నుంచి విముక్తి పొందుతామని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ లోకేశ్, ట్రైనీ ఎస్ఐ స్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి: corona: రాష్ట్రంలో కొత్తగా 3,614 మందికి కొవిడ్ పాజిటివ్