ETV Bharat / state

అంధుల జీవితాల్లో వెలుగు దివ్వె.. ఏడు పదుల వయసులోనూ అలుపెరగని కృషి

కంటిచూపు కోల్పోయిన వారికి ఆయనో దిక్సూచి. కారుచీకట్లు కమ్మకున్న వారి జీవితాలకు కాంతిరేఖ. నిరక్షరాస్యుడైనప్పటికీ ముందు చూపుతో కళ్లులేని వారికి ప్రపంచాన్ని చూపాలని నిరంతరం తపనపడే ఆశాజీవి. నేత్రధానంపై అవగాహన కల్పించేందుకు బతికుండగానే తన కంటిని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురానికి చెందిన మల్లు సత్యనారాయణ రెడ్డి. భర్త బాటలోనే పయనిస్తూ భార్య సోమమ్మ కూడా నేత్రధానంపై విస్తృత ప్రచారం చేస్తున్నారు.

mallu sathyanarayana about eye donations, mallu sathyanarayana effort for blind
అంధుల జీవితాల్లో వెలుగు దివ్వె, ఏడు పదుల వయసులోనూ అలుపెరగని కృషి
author img

By

Published : Jul 30, 2021, 12:23 PM IST

సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అటువంటి నేత్రాలు ప్రతిఒక్కరికీ చాలా అవసరం. అందుకే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురానికి చెందిన మల్లు సత్యనారాయణ రెడ్డి కళ్లులేని వారి పట్ల కాంతిరేఖగా నిలుస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ తన దృఢ సంకల్పాన్ని కోల్పోకుండా ముప్పై ఏళ్లుగా నేత్రదానంపై విస్తృత ప్రచారం చేస్తూ యువతీయువకుల్లో ఉత్తేజం నింపుతున్నారు. ఇప్పటివరకు 428 నేత్రాలనూ దానం చేయించి... మరో 11,000 మంది వద్ద నేత్రదానం హామీ పత్రాలను స్వీకరించి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఆలోచన ఎలా?

విజయవాడకు చెందిన దివంగత పార్లమెంట్ మాజీ సభ్యురాలు చెన్నుపాటి విద్య మనుమరాలు చనిపోవడంతో ఆమె కళ్లను 11ఏళ్ల బాలునికి దానం చేశారనే వార్త... మల్లు సత్యనారాయణ రెడ్డిని ఆలోచింపజేసింది. మరణానంతరం మన కళ్లను చూపులేని వారికి దానం చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపుతుందనే ఆలోచనని వెంటనే ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకొని చాలా మందిని విజ్ఞప్తి చేశారు. కొందరు ఆయన మాటలు పట్టించుకోకపోగా... హేళన చేస్తూ అవమానించేవారని తెలిపారు.

సంచలన నిర్ణయం

తాను బతికుండగానే నేత్రదానం చేసి... అవగాహన కల్పించాలని అనుకున్నారు. కంటి వైద్యులను సంప్రదించగా... బతికుండా నేత్రదానం చేయరాదని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. పదకొండు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆయన భార్య సోమమ్మ కూడా కమిటీలో సభ్యురాలిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చూపులేనివారి కోసం మరణానంతరం కళ్లను దానం చేయాలని ప్రచారం చేస్తున్నారు.

హేళన చేసేవారు

నేత్రదానం హామీ ఇచ్చి... వారు మరణించిన తర్వాత కళ్ల కోసం ఇంటికి వెళ్తే బంధువులు అవమానపరిచేవారు. కొందరు దాడికి యత్నించేవారు. అయినా భయపడకుండా మేం కృషి చేశాం. ఇప్పటివరకు 428 నేత్రాలను దానం చేయించాం. మరణించిన ఆరు గంటల్లోపే నేత్రాలను దానం చేయాలి. కొన్ని సందర్భాల్లో సిబ్బంది కొరత వల్ల ఆలస్యమై ఆ కళ్లు పనికి రాకుండా పోతున్నాయి. కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. దీనికోసం ఓ భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-మల్లు సత్యనారాయణ రెడ్డి

మరణానంతరం ఉపయోగపడని కళ్లను చూపులేని వారి కోసం దానం చేయాలని మల్లు సత్యనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ అంధుల కోసం పరితపిస్తున్న ఆయన ఎంతోమందికి ఆదర్శప్రాయుడు.

ఇదీ చదవండి: అక్కగా పుట్టింది.. అమ్మగా మారింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.