ETV Bharat / state

కంటైన్మెంట్​ ప్రాంతాలపై కలెక్టర్​ సమీక్ష - corona virus latest news

సూర్యాపేట జిల్లాలోని కంటైన్మెంట్​ ప్రాంతాలపై జిల్లా కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్​లు సమీక్షించారు. కుడకుడ, మట్టంపల్లి, నేరేడుచర్లలో కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల కంటైన్మెంట్​ జాబితా నుంచి తొలగించారు.

suryapet collector and sp visit containment areas
సూర్యాపేట జిల్లాలో కంటైన్మెంట్​ ప్రాంతాలపై కలెక్టర్​ సమీక్ష
author img

By

Published : Apr 28, 2020, 12:12 AM IST

సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కంటైన్మెంట్ ప్రాంతాలపై జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, ఎస్పీ భాస్కరన్​లు సమీక్షించారు. జిల్లా కేంద్రంలో రెడ్​జోన్ ఉన్న కుడకుడ, ఆత్మకూరు(ఎస్​) మండలంలోని ఏపూర్ ప్రాంతాలను సందర్శించారు. జిల్లాలో 12 కంటైన్మెం​ట్​లకు గాను కుడకుడ, మట్టంపల్లి, నేరేడుచర్ల ప్రాంతాలను ఎత్తివేసినట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటించారు. గత కొద్దీ రోజులుగా జరుగుతున్న పరిణామాలు పరిశీలించి అక్కడ 14 రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడం వల్ల ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించారు.

కంటైన్మెంట్ నుంచి తొలగించిన ఆయా ప్రాంతాలతో పాటు జిల్లాలో ఉన్న అన్ని రెడ్​జోన్లలో 28 రోజులపాటు ఆశా కార్యకర్తలతో ఇంటింటి ఆరోగ్య సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించి ధైర్యంగా ఉండాలని కోరారు. సెకండరీ చైన్ తెగిపోవడం వల్ల జిల్లాలో గత ఐదు రోజులుగా ఎటువంటి కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. కేసుల ఉద్ధృతి తగ్గినా అన్ని ప్రాంతాల్లో అధికారుల నిఘా, పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. కంటైన్మెంట్​ లేని ప్రాంతాల్లో రంజాన్ వేళ మసీదులో నలుగురికి ప్రార్ధనలు చేసుకునేందుకు అనుమతినిచ్చామని వెల్లడించారు.

ఇవీ చూడండి: ఉపాధి హామీ కూలీల వేతనం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.